ఉపాధినిచ్చే.. మావూరి సంత
కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహించే ఈ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు. పశువులు, గొర్రెల క్రయవిక్రయాలు, చిరువ్యాపారం, తైబజారుకు ఇది పెట్టింది పేరు. అటు రైతులకు ఇటు ప్రజలకు అవసమయ్యే వస్తువులు, పనిముట్లు లభిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు
- వారాంతపు సంతకు ప్రసిద్ధి ‘మాల్’
- ఆదాయం ఆర్జిస్తున్న వ్యాపారులు
- వందలాది మందికి ఉపాధి
- జోరుగా పశువుల క్రయ విక్రయాలు
- రైతులకు అందుబాటులో అన్ని పనిముట్లు
- చౌక ధరలకే నిత్యావసర వస్తువులు
యాచారం, సెప్టెంబర్ 21 : కొన్ని దశాబ్దాలుగా మాల్లో కొనసాగుతున్న వారాంతపు సంత (అంగడి) ఎంతో ప్రఖ్యాతి సంతరించుకున్నది. మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం ఈ సంతలో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహించే ఈ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు. పశువులు, గొర్రెల క్రయవిక్రయాలు, చిరువ్యాపారం, తైబజారుకు ఇది పెట్టింది పేరు. అటు రైతులకు ఇటు ప్రజలకు అవసమయ్యే వస్తువులు, పనిముట్లు లభిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు, కొనుగోలుదారులు భారీగా తరలివస్తుంటారు. పండుగలు, శుభకార్యాలకు కావాల్సిన వస్తువులు, వ్యవసాయ పరికరాలు, నిత్యావసర వస్తువులన్నీ ఒకే చోట దొరకడం ‘మాల్ సంత’ ప్రత్యేకత. పెద్ద మొత్తంలో క్రయవిక్రయాలు జరుగుతుండటంతో వ్యాపారులు మంచి లాభాలు గడిస్తున్నారు. ప్రజలకు సైతం చౌకధరలకే అన్ని రకాల వస్తువులు దొరకటంతో ఎంతో మంది సంత రోజు మాల్‌కు రాక మానరు. దీంతో మాల్ సంతతో వందలాది మందికి ఉపాధి దొరుకుతున్నది. మర్రిగూడ, చింతపల్లి, మల్లెపల్లి, మాడ్గుల, కందుకూరు, మంచాల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి మాల్ సంతకు వచ్చి క్రయ విక్రయాలు కొనసాగిస్తారు.
పశువుల క్రయ విక్రయాలకు ప్రత్యేకత
మాల్ సంతలో పశువుల క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతాయి. రైతులు అమ్మటానికి తెచ్చిన ఆవులు, ఎద్దులు, బర్రెలు, మేకలు, గొర్రెలు దర్శనమిస్తాయి. పాడి ఆవులు, గిత్తలు, లేగదూడలు, ముర్రజాతి గేదెలు, సాధారణ, జెర్సీ ఆవులు కొనుగోలు చేస్తారు. వాటి స్థాయికి తగ్గట్టుగా రూ. 15,000ల నుంచి లక్షకు పైగా వరకు ధర పలుకుతాయి.
గొర్రెలు ఫేమస్
వివాహాది శుభకార్యాలకు మేకలు, గొర్రెలు, గొర్రె పొట్టేళ్లను సంతలో చౌకధరలకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. గ్రామాల్లో మాంసం విక్రయించేవారు పెద్ద సంఖ్యలో మేకలు, గొర్రెలను కొనుగోలు చేస్తారు. ఒక్కోటి రూ.12,000నుంచి 15,000ల వరకు ధర పలుకుతాయి. వీటితో పాటు నాటుకోళ్లు, గిరిరాజ, సీమ, టర్కి, పందెం కోళ్లు, కోడి పిల్లలను సైతం జోరుగా విక్రయిస్తారు.
కూరగాయల నుంచి మొదలుకొని..
బట్టలు, పాతబట్టలు, ఎండు మిరపకాయలు, ఎండు చేపలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, నిమ్మకాయలు, పొగాకు, పూలు, పండ్లు, నాటు కోళ్ల విక్రయాలు ముమ్మరంగా కొనసాగుతాయి. వ్యవసాయానికి ఉపయోగించే నాగళ్లు, గొర్రు, గుంటుక, కలుపు తీసే యంత్రాలు, కత్తులు, గొడ్డళ్లు, కొడవళ్లు, పలుగు, పార, గడ్డపారలు, కర్రు, ఉచ్చులు, చేపల వలలు, జూట్ బ్యాగులు దొరుకుతాయి.
గృహోపకరణాల కోసం కిటికీలు, తలుపులు, మంచాలు, బీరువాలు లభిస్తాయి. గొంగళ్లు, జాడీలు, లంబాడీ మహిళలు ధరించే అద్దాల దుస్తులు, గాజులు అందుబాటులో ఉంటాయి.

చౌకధరలకే వస్తువులు దొరుకుతాయ్..
అంగడిలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చౌక ధరలకే అనేక వస్తువులు దొరుకుతాయి. ప్రతి మంగళవారం నిర్వహించే సంతలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. దీంతో వ్యాపారులు లాభాలను పొందుతారు. గ్రామపంచాయతీకి అంగడి నిర్వాహణతో మంచి ఆదాయం వస్తుంది. సంతలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం.
– చిన్నోళ్ల జంగమ్మ, జడ్పీటీసీ యాచారం
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

