Bhatukamma : ఒక్కెసి పూవేసి సందామమా..

వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వికారాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటు మహిళలు, యువతులు ఆడి పాడారు. ఇందులో డీడబ్ల్యూవో లలితకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, ఎంపీపీ చంద్రకళ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణంలోని 25వ వార్డులోని హనుమాన్ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖీల, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.

వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా తయారు చేసి పూజలు చేశారు. బతుకమ్మ ఆట పాటలు నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను కొలిచారు. చిన్నారులు, మహిళలు బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను సమీపంలోని కొలనులో నిమజ్జనం చేశారు. ఈ సంబురాల్లో వికారాబాద్, తాండూరు, పరిగి మండలాలకు చెందిన సీపీడీవోలు వెంకటేశ్వరమ్మ, రేణుక, ప్రియదర్శిణి, సూపర్వైజర్ పార్వతీ, అంగన్వాడీ టీచర్లు, ఆయ వార్డుల కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

