వికారాబాద్ : తెలంగాణ బాడిబిల్డింగ్ అసోసియేషన్ పోటీలు వికారాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని చిన్న పిల్లల వైద్య నిపుణులు ఆనంద్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ఆసుపత్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీ ఈసారి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 14న 3వ సారి వికారాబాద్ పట్టణంలో బాడి బిల్డింగ్ పోటీలు నిర్వహిస్తారు. పట్టణంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్‌హాలులో సాయంత్రం 5 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు బాడి బిల్డర్లు పాల్గొని ప్రతిభ చూపాలన్నారు.
వికారాబాద్‌లో 4, తాండూరులో 2, కొడంగల్ 1, పరిగిలో 2 జిమ్‌లు ఉన్నాయన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం జిమ్ చేయాలని తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతి రూ. 20వేలు, ద్వితీయ బహుమతి రూ. 15వేలు, తృతీయ బహుమతి రూ. 10వేలు ఉంటుందని ప్రకటించారు. ఈ సమావేశంలో సాయి, రసిమ్, అశోక్‌లు ఉన్నారు.