గడువులోపు ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి
నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.
పరిగి, మార్చి 4 : నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్నటువంటి దరఖాస్తులు పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఆర్ఎస్ఆర్ ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు.
మండలంలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు, రీ సర్వ్ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం చెక్ చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో ఉండే పహణీ ప్రకారం చెక్ చేసి రిజెక్ట్ చేయాల్సి వస్తే కచ్చితమైన కారణాలు ఉండాలన్నారు. గడువు లోపు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, ధరణి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిగిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, వసతులు, పరీక్ష నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌కు అధికారులు తెలిపారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకురాకుండా చర్యలు చేపట్టడం జరుగుతున్నదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 267 మంది విద్యారులకు 261 మంది పరీక్షకు హాజరైనట్లు సంబంధిత అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, చీఫ్ సూపరింటెండెంట్ మక్బూల్, డీవో లక్ష్మయ్య పాల్గొన్నారు.
వికారాబాద్, మార్చి 4 : నిర్ణీత గడువు లోపు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ధరణి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధరణికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఆర్ఎస్ఆర్ ప్రకారం సత్వరమే పరిష్కరించాలన్నారు.
రీ సర్వ్ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం సర్వే నంబర్లవారీగా గ్రామపంచాయతీ బోర్డుపై డిస్ప్లే చేయాలన్నారు. ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నవి, ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారో తెలుసుకున్నారు. రీ సర్వ్ సెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం చెక్ చేసుకోవాలని, ఆన్లైన్లో ఉండే పహణీ ప్రకారం చెక్ చేసి రిజెక్ట్ చేయాల్సి వస్తే కచ్చితమైన కారణాలు ఉండాలన్నారు. గడువు లోపల పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆన్లైన్లోనే కాకుండా ఫైల్స్ రూపంలో కూడా నిర్వహించాలని తహసీల్దార్లను ఆదేశించారు. చాలా జాగ్రత్తగా, వేగవంతంగా ఈ స్పెషల్ డ్రైవ్‌ను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ధరణి ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
ల్లాలో గ్రామపంచాయతీల బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తిచేసి ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో జరిగే అభివృద్ధి నిర్మాణ పనుల్లో భాగంగా బిల్డింగ్లేని గ్రామపంచాయతీ ఉండకూడదన్నారు. ప్రతి రోజూ జరగాల్సిన పనులకు ఎన్ని మిల్లర్లు, ఎంత మంది లేబర్ ఉంటే పనులు త్వరగా పూర్తి చేయొచ్చో ప్రణాళిక రూపొందించుకోవాలని, దాని ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బొంరాస్‌పేట్, కొడంగల్ మండలాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆగకూడదని, ప్రతి గ్రామపంచాయతీ బిల్డింగ్స్, స్కూల్స్ కాంపౌండ్ వాల్స్, కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. పూర్తయిన వాటికి తప్పనిసరిగా ఎఫ్‌టీవో జనరేట్ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో సీసీ రోడ్లకు మంజూరైన నిధులతో అంచనాలను రూపొందించుకుంటూ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి లేబర్‌ను సమీకరించి పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, అధికారులున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

