ఏసీబీకి చిక్కిన వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు.
హయత్‌నగర్, ఆగస్టు 22 : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్ సహాయంతో లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు వివరాలను వెల్లడించారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని సుష్మా చౌరస్తా వద్ద ఉన్న వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎస్ రాజేశ్ కుమార్ సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధిలో గల 200 గజాల ప్లాటును రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో బాధితుడి వద్ద సబ్ రిజిస్ట్రార్ రూ.లక్ష డిమాండ్ చేశాడు.
ఆయన డిమాండ్ మేరకు బాధితుడు రూ.70వేలు చెల్లించేందుకు అంగీకరించాడు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్దనే అర్జున్‌రావు డాక్యుమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న నాగోల్‌కు చెందిన రమేశ్ గౌడ్ సహాయంతో బాధితుడు, సబ్‌రిజిస్ట్రార్‌కు రూ.70వేలు చెల్లించాడు. రమేశ్‌గౌడ్, సబ్‌రిజిస్ట్రార్‌కు నగదును అందజేస్తున్న క్రమంలో సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

