తాండూరు/వికారాబాద్/కొడంగల్, అక్టోబర్ 23: వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలైనది. తాండూరు, చేవెళ్ల టౌన్, వికారాబాద్, పరిగి, కొడంగల్‌లోని పట్టణాలు, మండల కేం ద్రాలు వేడుకలకు సిద్ధమయ్యాయి. చీకటిని పారదోలుతూ వెలుగులు నింపే పండుగ దీపా వళి. పండుగ సందర్భంగా లక్ష్మీపూజలు, నోము లు, వ్రతాలు ఆచరించేందుకు ఇండ్లు, వ్యాపార సముదాయాలను సిద్ధం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో నివాసముండే వారు పిల్లలతో కలిసి స్వగ్రామాలకు చేరుకున్నారు.
పండుగను పురస్కరించుకుని మార్కెట్లో కొనుగోళ్ల సందడి మొ దలైనది. మహిళలు పూలు, ప్రమిదలు, పూజా సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. పం డుగ రోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నా నం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు. సంధ్యా సమయంలో మహాలక్ష్మీదేవిని పూజించి ధూప, దీప, నైవేద్యాలు పెట్టి రావమ్మ మహాలక్ష్మీ రావమ్మా.. మమ్ము దీవించి సల్లంగా ఉండేలా ఆశీర్వదించమ్మ అంటూ మంగళ హారతులిస్తారు. ఇంటి ముందు ఉన్న తులసికోట వద్ద, ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇళ్లంతా దీపజ్యోతి వెలుగులను నింపుతారు. పండుగ రోజు చేసే తీపి వంటకాల్లో సేమియాల కు విశేష ప్రాధాన్యం ఉండటంతో మిఠాయి, కిరాణా షాపులు సేమియా కొనుగోలుదారుల తో కిటకిటలాడుతున్నాయి.
ఈ ఏడాది వివాహమైన కొత్తల్లుడిని, కూతురిని ఇంటికి పిలుచుకుని నూతన దుస్తులు పెట్టి బంగారు ఆభరణాలను సమర్పిస్తారు. వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను శుభ్రం చేసుకుని రంగు రం గుల పూలతో అందంగా అలంకరించి లక్ష్మీ దేవి పూజలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పూలు, మట్టి ప్రతిమలు, గుమ్మడికాయలను విక్రయిస్తున్నారు. కిలో పూలు రూ.100 నుంచి రూ.300 వరకు ధర పలుకుతున్నది. మ ట్టి ప్రతిమలు సైజులను బట్టి రూ.120 నుంచి రూ. 400 వరకు ఉన్నాయి.
అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి
పర్యావరణానికి ముప్పు కలుగని పటాకులనే సాధ్యమైనంత వరకు కా ల్చాలి. పోటాపోటీ గా పెద్ద శబ్దాలు వచ్చే బాంబులను కాల్చి.. ప్రజలతోపాటు ఇతర జీవులకు ఇబ్బంది కలిగించొద్దు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి.
-స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ తాండూరు
చేవెళ్ల డివిజన్ పరిధిలో..
దీపావళి పండుగను పురస్కరించుకుని పూల ధరలకు రెక్కలు రావడంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రసుత్తం మార్కెట్లో చామంతి, బంతి, గులాబీ పూలను విక్రయిస్తున్నారు. ఇదివరకు కిలో రూ.40-రూ.50 వరకు అమ్మిన పూలు ఇప్పుడు రూ.100- రూ.150 వరకు విక్రయిస్తున్నా రు. చేవెళ్ల డివిజన్ పరిధిలో చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్ మండలాల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో పూలతోటలను సాగుచేశారు. చేవెళ్ల మండలంలో 150 ఎకరాల్లో బంతి, చామంతి, గులాబీ పూల తోటలను సాగుచేశారు. అక్కడి పూలను విక్రయించేందుకు రైతులు నగరంలోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌కు తరలిస్తారు.
చామంతి పూలతో మంచి లాభాలు
ఎకరన్నర పొలంలో చామంతి పూలను సాగు చేశా. రూ. లక్ష వరకు ఖర్చు అయ్యింది. ఇటీవల కురిసిన వర్షాలకు పూల తోట దెబ్బతిన్నది. దసరా, దీపావళి పండుగల సందర్భంగా పూలకు మంచి ధర రావడంతో పెట్టుబడి పోగా, మంచి లాభాలు వస్తున్నాయి.
-మల్లారెడ్డి, పల్గుట్ట, చేవెళ్ల
ఖర్చులు పోగా ఆదాయం వస్తున్నది
నేను గులాబీ పూలను సాగు చేశా. ఇటీవల కురిసిన వానలకు పంటకు కొద్దిగా నష్టం జరిగింది. అయినా దీపావళి పండుగ సందర్భంగా గులాబీ పూలకు దాదాపుగా రూ.150 ధర పలుకుతుండటంతో పెట్టిన ఖర్చులు పోగా ఆదాయం వస్తున్నది.
-ఇమ్రాన్, సింగప్ప గూడ గ్రామం
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇంటిల్లిపాదీ సంతోషంగా జరుపుకొనే వేడుక దీపావళి. ఈ పండుగను ప్రతిఏటా ఆశ్వయుజ మాసం బహుళ పక్షం అమావాస్య రోజున జరుకోవడం ఆనవాయితీ. దీపావళి నాడు లక్ష్మీపూజలు చేయడం, గౌరమ్మ నోములు నోచడం ప్రత్యేకత. దుకాణాలు, వ్యాపార సముదాయాలు, కర్మాగారాలు, చేతివృత్తుల వారు లక్ష్మీ పూజలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందుకోసం ఇళ్లు, దుకాణాల్లో ఉన్న పాత సామగ్రి, చెత్తను తొలగించి శుభ్రం చేసుకుని రంగులు వేసి ముస్తాబు చేసుకుంటారు. మామిడాకులతో తోరణాలు కట్టి, పూలు, విద్యుత్ దీపాలతో గృహాలు, దుకాణాలను సుందరంగా అలంకరిస్తారు. వ్యా పారులు ఈ రోజు నుంచే కొత్త ఖాతా పుస్తకాలను రాయ డం ప్రారంభిస్తారు. బొమ్మల కొలువు కోసం వినియోగించే బొమ్మల ధరలు పెరిగాయి.