కోనసాగుతున్న నామినేషన్ల పర్వం
తాండూరులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో 12 మంది అభ్యర్థులు 13 సెట్ల నామపత్రాలను దాఖలు చేసినట్లు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు.
- నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్, తాండూరు అభ్యర్థి పంజుగుల రోహిత్‌రెడ్డి, పరిగి అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డి
- అంతకుముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అభ్యర్థులు
- తాండూరులో 12 మంది 13, పరిగిలో ఐదు గురు ఆరు నామినేషన్లు దాఖలు
తాండూరు, నవంబర్ 8: తాండూరులో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. ఐదు రోజుల్లో 12 మంది అభ్యర్థులు 13 సెట్ల నామపత్రాలను దాఖలు చేసినట్లు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. బుధవారం బీఆర్ఎస్ నుంచి పంజుగుల రోహిత్‌రెడ్డి మొదటి సెట్ నామినేషన్‌ను భార్య ఆర్తిరెడ్డి, తల్లి ప్రమోదినీదేవితో పాటు బీఆర్ఎస్ నాయకులు పురుషోత్తంరావు, విజయ్‌కుమార్‌తో కలిసి వేశారు.
గురువారం రెండో సెట్ నామినేషన్ వేసేందుకు 50 వేలకు పైగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా వస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తాండూరు అసెంబ్లీ ఎమ్మెల్యేకు పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి పి.రోహిత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి బి.మనోహర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి బి.చంద్రశేఖర్, ఏడీఆర్పీ నుంచి పి.అజయ్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది నామినేషన్లు వేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
‘లెక్చరర్ గోపాలకృష్ణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’
Nani | నాని కెరీర్లో కీలక నిర్ణయం.. ఇకపై అలాంటి సినిమాలకు దూరం..!
Man Kills Girlfriend | అనుమానంతో ప్రియురాలిని లాడ్జిలో హత్య చేసిన ప్రియుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

