హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని నాసర్ పోలో-ఈక్వెస్ట్రియన్ అకాడమీ హైదరాబాద్ హార్స్ షో సమ్మర్ చాంపియన్‌షిప్ టూర్ 2ను విజయవంతంగా నిర్వహించింది. అకాడమీకి చెందిన అత్యాధునిక ఈక్వెస్ట్రియన్ సౌకర్యాల వద్ద 3 రోజుల పాటు నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన రైడర్లు డ్రెస్సేజ్, షో జంపింగ్ విభాగాల్లో తమ అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించారు.
ప్రారంభ స్థాయి పోటీల నుంచి అధునాతన ఈవెంట్ల వరకు సాగిన ఈ ప్రదర్శనలు ఈక్వెస్ట్రియన్ క్రీడాభిమానులను, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశంలోని ప్రముఖ ఈక్వెస్ట్రియన్ పోటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ హార్స్ షో.. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ హైదరాబాద్‌ను ఈ క్రీడల ప్రధాన కేంద్రంగా మరింత బలోపేతం చేస్తోందని నాసర్ అకాడమీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.