‘సోలార్’ మీటరింగ్.. తప్పుడు రీడింగ్
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సాహించాల్సిన విద్యుత్ శాఖ ఔత్సాహికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. లక్షలు వెచ్చించి ఇండ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా లెక్కించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
- విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం
సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సాహించాల్సిన విద్యుత్ శాఖ ఔత్సాహికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నది. లక్షలు వెచ్చించి ఇండ్లపై ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా లెక్కించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా గోపన్‌పల్లిలో జర్నలిస్టు కాలనీ ఫేజ్-3లోని మోనార్క్ కాంప్లెక్స్‌లో అమర్చిన సోలార్ ప్యానళ్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మీటరింగ్ తీసే సమయంలో పరిగణనలోకి తీసుకోకుండా బిల్లులు జారీ చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని యూనిక్ సర్వీస్ నంబరు (యూఎస్సీ) 107498489 కలిగిన విద్యుత్ వినియోగదారులు తమ కాంప్లెక్సుపై సోలార్ విద్యుత్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకున్నారు. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సరఫరా చేసే లైన్‌తో అనుసంధానం చేసి నెట్ మీటరింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు.
కాగా, ప్రతి నెలా మొదటి వారంలో జారీ చేస్తున్న విద్యుత్ బిల్లుల్లో సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్లను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాము వాడిన మొత్తం యూనిట్లతో బిల్లు జారీ చేశారని, దీంతో జూన్‌కు సంబంధించిన నెల వారీ బిల్లు రూ.43509లు వచ్చిందని వినియోగదారుడు గోపాల్‌రావు తెలిపారు. తమ భవనంపై ఏర్పాటు చేసిన సొలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ఎక్కడికి పోయిందని, దాన్ని ఎందుకు లెక్కించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయమై విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వారు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు సోలార్ విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

