68శాతం శుద్ధి చేస్తున్నాయి..

- ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ
- నగరంలో మొత్తం 628 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు
- 79.679 మిలియన్ లీటర్ల నీటిలో 99 శాతం వినియోగం
- ఎస్టీపీలు పని చేయకుంటే యాజమాన్యాలపై చర్యలు
- పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పష్టీకరణ
నిర్మాణానికే పరిమితమై.. పని చేయని మురుగునీటి శుద్ధి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్‌ను కొనసాగిస్తున్నది. దాదాపు 68 శాతం ఎస్టీపీలు పని చేస్తుండగా.. వివిధ కారణాలతో మిగిలినవి అందుబాటులోకి రాలేదని ఆడిట్లో తేలింది. దీంతో మురుగునీటిని నిర్లక్ష్యంగా వదిలివేసే ఎస్టీపీల నిర్వాహకులపై చర్యలు తప్పవని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ పరిధిలో ఉత్పత్తి అవుతున్న మురుగును శుద్ధి చేసేందుకు పలు ప్రాంతాల్లో ఎస్టీపీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పెద్ద ఎత్తున నివాస సముదాయాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాలు ఎస్టీపీలను ఏర్పాటు చేసుకొని మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే బయటికి వదలాలని నిబంధనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ రికార్డుల ప్రకారం నగరంలో 628 ప్రైవేటు ఎస్టీపీలు ఉన్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టిన దాఖలాలు లేవు.
తొలిసారిగా ఆడిట్..
హెచ్ఎండీఏ పరిధిలోని ప్రైవేటు ఎస్టీపీలపై తొలిసారిగా పురపాలక శాఖ ఆడిట్ చేపట్టడం విశేషం. వాస్తవంగా ఎస్టీపీలు పని చేస్తున్నాయా? లేవా? ఒక వేళ అవి పని చేస్తే ఆ నీటిని తిరిగి ఎలా వినియోగిస్తున్నారు? అనే అంశాలను తేల్చేందుకు ఈ ఆడిట్ చేపట్టారు. ఈ మేరకు రికార్డుల్లో ఉన్న 68 శాతం ఎస్టీపీలు ప్రస్తుతం పని చేస్తున్నట్లుగా తేలింది.
ఆడిట్ వివరాలు ఇలా..
- జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ రికార్డుల ప్రకారం 2014 నుంచి ఇప్పటివరకు ఉన్న ప్రైవేటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు – 628
- ఇందులో అధికారులు ఆడిట్ చేసినవి – 537, ఇంకా ఆడిట్ చేయాల్సినవి – 91 (కొవిడ్ కారణంగా అధికారుల్ని అనుమతించలేదు)
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేసినవి – 449, ఓసీ జారీ చేసిన ఎస్టీపీల సామర్థ్యం – రోజుకు 154.419 మిలియన్ లీటర్ల శుద్ధి
- నిర్మాణ దశలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాలు – 88
- ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఎస్టీపీలు – 366, వినియోగంలో ఉన్న వాటి సామర్థ్యం – రోజుకు 137.379 మిలియన్ లీటర్ల శుద్ధి
- ప్రస్తుతం పని చేయని మురుగునీటి శుద్ధి కేంద్రాలు – 41
- అసలు అందుబాటులో లేని కేంద్రాలు – 42
- నిబంధనల ప్రకారం ఓసీలు జారీ చేసిన వాటిలో 85 శాతం ఎస్టీపీలు పని చేస్తున్నట్లుగా ఆడిట్లో తేలింది.
- పని చేస్తున్న 449 మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో రోజుకు 79.679 మిలియన్ లీటర్ల సామర్థ్యం ఉన్న 228 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి వచ్చే నీటిని పలు అవసరాలకు వినియోగిస్తున్నారు. మిగిలిన 57.7 ఎంఎల్డీ సామర్థ్యం ఉన్న కేంద్రాల నీటిని మాత్రం వినియోగించడం లేదు.
- మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా రోజుకు వచ్చే 79.679 మిలియన్ లీటర్ల నీటిలో దాదాపు 99 శాతం అంటే 79.121 మిలియన్ లీటర్ల నీటిని ఫ్లషింగ్, గార్డెనింగ్‌కు వినియోగిస్తున్నారు.
- మిగిలినది కూలింగ్ వాటర్‌గా వినియోగిస్తుండగా.. 0.558 మిలియన్ లీటర్ల నీటిని జీహెచ్ఎంసీకి విక్రయిస్తున్నారు.
పని చేయకుంటే చర్యలు తప్పవు..
- కొన్ని చోట్ల పేరుకే ఎస్టీపీలను నిర్మించినా మురుగును మాత్రం యథావిధిగా బయటకు వదులుతున్నారు.
- రెండు రోజుల కిందట మహేశ్వరం సంగీత్ ట్విట్టర్ ద్వారా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు.
- వెంటనే స్పందించిన ఆయన తొలిసారిగా చేపట్టిన ప్రైవేటు ఎస్టీపీల ఆడిట్‌ను ప్రస్తావించారు.
- ప్రైవేటు ఎస్టీపీలపైనా పర్యవేక్షణ చేపట్టామని, ఒకవేళ ఎక్కడైనా ఎస్టీపీలు పని చేయకుంటే మాత్రం వెంటనే సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

