నోటాకు అధిక ఓట్లు వస్తే రీ పోల్
ఓటరు తనకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తారని, ఒక వేళ నోటాకు అధిక ఓట్లు వస్తే వెంటనే ఆ నియోజకవర్గంలో రీపోల్ చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు.
- నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రకటించాలి
- ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, మే 28 : ఓటరు తనకు ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేస్తారని, ఒక వేళ నోటాకు అధిక ఓట్లు వస్తే వెంటనే ఆ నియోజకవర్గంలో రీపోల్ చేయాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్ల్క్లబ్లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి అధ్యక్షతన పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలుపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి హాజరై ప్రసంగించారు. నోటా అమలు తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు సుమారు 1.5 శాతం ఓట్లు వచ్చాయని, నోటాకు అధిక ఓట్లు వచ్చినా రీ పోల్ జరిగే వెసులుబాటు లేదన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నదని, పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి రాష్ర్టాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాను ఓ కల్పిత అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆర్డర్ ఇచ్చారని గుర్తు చేశారు. దీంతో ఇతర అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రిపోల్ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రీ పోల్‌లో మొదట బరిలో ఉన్న అభ్యర్థులెవరూ పోటీ చేయడానికి వీలు లేదన్నారు. నోటాను బలపర్చడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తున్న కృషిని అభినందించారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ వచ్చే రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, 2019లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో సుమారు 16 శాతం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. ఇందులో అధికంగా వేలం పాటలో గెలిచిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారని, ఇక్కడ గ్రామ కమిటీలు, కుల సంఘాలు రాజ్యాంగేతర శక్తులుగా పనిచేస్తూ సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నారని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికల వల్ల సామాన్యులు ఓటు హక్కును కోల్పోతారని, ఈ పరిస్థితి మారాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు బి.మన్మథరెడ్డి, విశ్రాంత డీజీపీ గోపాల్ రెడ్డి, లోక్‌సత్తా నాయకులు బండారు రామ్మోహన్ రావు, ఎన్నికల నిఘా వేదిక ప్రతినిధి వీవీ రావు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, సహాయ కార్యదర్శి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

