Rangareddy : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలి
రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్

షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోషణమాసం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పోషణమాసంలో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించాలన్నారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్బిణులు, బాలింత లు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మండలాల వారీగా పిల్లలలో ప్రస్తుతం ఉన్న బరువు, ఉండాల్సిన బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని, పిల్లల్లో అనిమియా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ చేయించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు.
పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడూ కోలిచి ఆప్డెట్ చేయాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నీటి సౌకర్యం కల్పించాలని, పెండింగులో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అనంతరం పోషణమాసం గోడ పత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మోతి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ ఓంప్రకాశ్, మిషన్ భగీరథ అధికారులు, సీఈపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

