రంగారెడ్డి జిల్లాలో 79 దరఖాస్తులు
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు పునరుద్ధరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డితో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
- దరఖాస్తులు స్వీకరించిన రంగారెడ్డి కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు పునరుద్ధరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డితో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి 79 ఫిర్యాదులు వచ్చాయని .. వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు ఆన్లైన్ పోర్టల్‌లో అప్‌లో డ్ చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిషారానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు సంబంధించి ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పంపించడం జరుగుతున్నదని.. అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని పరిషరించాలని ఆదేశించారు. ఒకవేళ వినతులు పరిషారం కాకుంటే అందుకు గల కారణాలను స్పష్టంగా పేరొనాలని సూచించారు.
ప్రజావాణి రిజిస్టర్‌ను విధిగా నిర్వహించాలని, రిజిస్టర్లో నమోదు చేయడంవల్ల ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కరించడం జరిగింది? ఎన్ని పెండింగ్‌లో ఉన్నయో తెలుస్తుందని తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఉదయం 10.30 గంటలకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులందరూ రావాలని సూచించారు. ప్రజావాణిలో డీఆర్వో సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

