వరుణ దేవుడా కరుణించు
ఈ సీజన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా.. జిల్లాలో మా త్రం ఆశించిన స్థాయిలో వానలు కురవడంలేదు. నగరాల్లో భారీగా కురుస్తున్న వర్షం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంలేదు.
- రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదు
- 13 మండలాల్లో ఆశించిన స్థాయిలో కురవని వానలు
- సీజన్ ఆరంభంలోనే కలిసి రాని కాలం
- కలవరపడుతున్న అన్నదాత.. ఊపందుకోని ఎవుసం
- సరైన వర్షాలు లేకుంటే మళ్లీ విత్తుకోవాల్సిందే..
రంగారెడ్డి, జూన్ 18(నమస్తే తెలంగాణ) : ఈ సీజన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా.. జిల్లాలో మా త్రం ఆశించిన స్థాయిలో వానలు కురవడంలేదు. నగరాల్లో భారీగా కురుస్తున్న వర్షం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంలేదు. ఫలితంగా వానకాలం సీజన్ పనులు నేటికీ ఊపందుకోలేదు. ఇంకా చాలామంది రైతులు విత్తనాలు వేసే సాహసం చేయలేక.. పునరాలోచనలో పడ్డారు. ఇప్పటికే విత్తనాలు వేసిన వారు..ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే కాలం కలిసి రాకపోవడంతో జిల్లా రైతాంగం కలవరపడుతున్నది.
దిగుబడులపై ప్రభావం..
రైతులు ఏప్రిల్, మే నెలల్లోనే దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో మే చివరి వారంలోనే పత్తి వంటి విత్తనాలను విత్తుకోగా..మరికొన్ని ప్రాంతాల్లో జూన్ మొదటి వారంలో విత్తనాలు నాటారు. ఆశించిన స్థాయిలో వర్షా లు లేక కొన్ని మొలకలు రాకపోగా..కొన్ని చోట్ల మొలక శాతం చాలా తక్కువగా ఉన్నది. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో 4,45,428 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పం టలను సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో అత్యధికంగా పత్తి 1,76,174 ఎకరాల్లో, వరి 1,38,187 ఎకరాల్లో, మొక్కజొన్న 66, 530 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. జూన్ మొదటి వారంలోనే పంటల సాగు పనులు ముమ్మరం కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటివరకు భారీ వర్షం నమోదు కాకపోవడం..ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో సమృద్ధిగా వర్షాలు కురవని పక్షంలో పత్తి విత్తనాలను మరోసారి నాటుకోవాల్సి వస్తుందని , ప్రస్తుత పరిస్థితుల ప్రభావం దిగుబడులపై పడనున్నదని రైతులు పేర్కొంటున్నారు.
విత్తుకునేందుకు మరికొంత సమయమున్నా ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వానలు కురవని పక్షంలో గత యాసంగి పరిస్థితులే పునరావృతమవుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
చాలా చోట్ల.. లోటు వర్షపాతమే ..
జూన్‌లో మొత్తం 94 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 68.5 మి.మీల మేర సాధారణ వర్షపాతమే నమోదైంది. ఈ క్రమంలో జిల్లాలో 13 మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
అధిక వర్షపాతం నమోదైన మండలాలు
కొందుర్గు, మొయినాబాద్, కడ్తాల్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, శంకర్పల్లి, శేరిలింగంపల్లి, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, హయత్‌నగర్, సరూర్నగర్సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు గండిపేట, రాజేంద్రనగర్, బాలాపూర్, మహేశ్వరం,
చేవెళ్ల, నందిగామ, ఫరూక్నగర్ లోటు వర్షపాతం : యాచారం, కందుకూరు, షాబాద్, చౌదరిగూడెం అత్యల్ప వర్షపాతం : శంషాబాద్, కడ్తాల్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

