Ramadan | హైదరాబాద్‌లో రంజాన్ శోభ.. మసీదుల్లో ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు
“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం.
Ramadan | “శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం. నగరంలో గురువారం రంజాన్ వేడుకలు జరుగనున్నాయి. శాంతి పూర్వక వాతావరణంలో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని ముస్లిం మత పెద్దలు సూచించారు. చార్మినార్, సికింద్రాబాద్, బహదూపుర, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో రంజాన్ శోభ సంతరించుకున్నది.

గురువారం ముస్లిం సోదరులు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తిప్రవత్తులతో జరుపుకుంటారు. ముస్లింలు తమ ఇంట్లో పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన వివిధ తీపి వంటలను హిందువులు, పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. కొత్త బట్టలు ధరించి నమాజ్‌ను చేస్తారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనాలు చేసుకుంటూ ఈద్‌ముబారక్ తెలుపుకుంటారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ)
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

