Kandi Cultivation | కంది సాగు చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వ్యవసాయ అధికారులు
Kandi Cultivation | కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని,
Kandi Cultivation | కంది సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే సరైన దిగుబడులు వస్తాయి. పైరును ఆశించే పురుగులు, తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పూత దశలో ఉన్న కంది చేలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉన్నదని, రైతులు అప్రమత్తతో నిష్టాన్ని నివారించుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. క్రిమిసంహారక మందులను మోతాదు తగ్గట్టు వాడితే అధిక దిగుబడి వచ్చి, ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు.
కంది పంటలో పూత దశ కీలకమైనది. ఈ సమయంలో నీటి ఎద్దడి ఉన్నా, అవసరానికి మించి ఎక్కువ తడి ఇచ్చినా పూత రాలి దిగుబడి తగ్గుతుంది. ఈ క్రమంలో పూత దశలో ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పూత రాలుడు నివారణకు 8-10 లీటర్ల నీటికి ప్లానోఫిక్స్ 2మి.లీ. చొప్పున కలిపి 10రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. పంటకు రోగాలు సోకిన వెంటనే రైతులు గుర్తించి మీకు చేరువలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులను పిచికారీ చేయాలి.
పూత పెంకు పురుగు
కంది పూత దశలో ఉన్నప్పుడు ఎర్రని లేదా నారింజ రంగు మచ్చలు, నల్లని గీతలు ఉన్న పెంకు పురుగులు ఆశించి మొగ్గలను తింటాయి. దీంతో కాత తగ్గిపోతుంది. ఈ పురుగులను గమనించిన వెంటనే ఉదయం పూట వాటిని ఏరి మంటలో కాల్చివేయాలి.
మారుకమచ్చల పురుగు
ఈ పురుగు లార్వాలు ఆకులను, పూతను, కాయలను కలిపి గూడులా చేసి తింటాయి. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్, ఒక మి.లీ. డైక్లోరోవాస్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే 10లీటర్ల నీటికి స్పైనోసాడ్ 3 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
ఆకుచుట్టు పురుగు
ఇది సాధారణంగా పంట పెరిగే దశలో ఆశించి నష్టపరుస్తుంది. కాని కొన్ని సమయాల్లో పూత దశలోనూ దీని ప్రభావం ఉంటుంది. లద్దెపురుగు పూత దశలో పూతను గూడులా చేసి లోపలి పదార్థ్దాలను తింటుంది. కాయలు తయారు అయ్యేటప్పుడు మొగ్గలను దగ్గరగా చేర్చి గూడు కడుతుంది. కాయలకు రంధ్రం చేసి లొపలి గింజలు తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం జరుగుతుంది. విత్తనం మొలకెత్తే దశలో ఈ పురుగు ఆశిస్తే పంటకాలం మొత్తం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తద్వారా పంట తీవ్రంగా నష్టపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్వినాల్ఫాస్ 2.మి.లీ. చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి.
పంట కోత నిల్వ
కంది కాయలు ఎండిన తరువాత మాత్రమే పంటను కోయాలి. కారణం పూత రెండు నెలల వరకు వస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కల్లెతో కొట్టి కాయల నుంచి గింజలను వేరు చేయాలి. కందులను బూడిదతో కలిపి గానీ, వేపాకు కలిపి గానీ నిల్వ చేయాలి. నిల్వ చేసేటప్పుడు పురుగులు ఆశించకుండా ఉండేందుకు బాగా ఎండబెట్టాలి. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కంది పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు. రైతులు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు తీసుకుంటేనే అధిక దిగుబడి సాధించవచ్చు. పెట్టిన పెట్టుబడితో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. కంది సాగులో మంచి లాభాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

