సజావుగా ఓట్ల లెక్కింపు
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక నేతృత్వంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఉన్నతాధికారులు కౌంటింగ్ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించారు.
- సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.. కలెక్టర్ శశాంక
రంగారెడ్డి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగింది. రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక నేతృత్వంలో వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఉన్నతాధికారులు కౌంటింగ్ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించారు. ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేందర్‌కుమార్ కటారియా, కౌంటింగ్ పరిశీలకురాలు మృణాళినీ సావంత్ ఓట్ల లెక్కింపు తీరును నిశితంగా పరిశీలించారు. ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంతరాల్లేకుండా ఓట్ల లెక్కింపు ప్ర క్రియ సాఫీగా పూర్తయ్యింది. డీసీపీ శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు బందోబస్తును పర్యవేక్షించారు. ఎలాంటి ఆటంకాల్లేకుండా జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సాఫీగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ శశాంక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషిచేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

