దసరాలోపు ఇండ్ల స్థలాలు
ఫార్మాసిటీ భూనిర్వాసితులకు దసరా పండుగ లోపే ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తాటిపర్తి, కుర్మిద్ద, నా నక్నగర్ గ్రామాలకు చెందిన ఫార్మా భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ అనంతరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు.
- ఫార్మాసిటీ ఏర్పాటుతో మంచి భవిష్యత్తు
- 600ల ఎకరాలలో కొనసాగుతున్న పనులు
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- ఫార్మా భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్ల పంపిణీ
యాచారం, ఆగస్టు 16 : ఫార్మాసిటీ భూనిర్వాసితులకు దసరా పండుగ లోపే ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తాటిపర్తి, కుర్మిద్ద, నా నక్నగర్ గ్రామాలకు చెందిన ఫార్మా భూ నిర్వాసితులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్డీఓ అనంతరెడ్డి అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఫార్మాసిటీ లో భూములు కోల్పోయిన లబ్ధిదారులకు ఎకరాకు 121 గజాల చొప్పున 979మంది రైతులకు ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు. పట్టా సర్టిఫికెట్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీలో భూములు కో ల్పోయి ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు పొందిన లబ్ధిదారులకు దసరాలోపే స్థలాలను కేటాయిస్తామన్నారు. ఈ స్థలాలను లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అప్పగిస్తామన్నారు. ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన 600ల ఎకరాలలో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. భూమి చదును, రోడ్ల నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు.
భూదాన్ భూమి అర్హులకే..
తాటిపర్తిలో 250ఎకరాలలో ఉన్న భూదాన్ భూమిని అర్హులైన రైతులకే చెందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మేడిపల్లిలో పరిహారం అందిన తర్వాత అదనంగా 200 ఎకరాలకు నష్ట పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు అత్యంత టెక్నాలజీతో చేపట్టనుండడంతో, కాలుష్యం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఫార్మా రాకతో స్థానిక యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఫార్మాతో మండలానికి రానున్న రోజు ల్లో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. టీఎస్ఐఐసీ సహకారంతో మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామా లు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుకన్య, గ్రంథాలయ సం స్థ జిల్లా చైర్మన్ వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మ న్ చంద్రయ్య, ఐబీపీ ఎంపీపీ కృపేశ్, తహసీల్దార్ శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ విజయలక్ష్మి, సర్పంచ్‌లు ఉదయశ్రీ, జగదీశ్, కృష్ణ, సంతోష, హబీబుద్ధీన్, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, డైరెక్టర్లు బాషా, శశికళ, ఎంపీటీసీ బాబు, రవికిరణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, నాయకులు శేఖర్‌రెడ్డి, యాదయ్య, రమేశ్, ఖాజు, శివ, గోపాల్, రాజు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్‌రావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యె కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 64..21కోట్ల అభివృద్ధి పనులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా యాచారంలో రూ.1.50కోట్లతో నిర్మించే నూతన దవాఖాన భవన నిర్మాణానికి మంత్రి శంకు స్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న దవాఖానా ప్రస్తుతం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పరిధిలో పని చేస్తుందన్నారు. 30పడకల దవాఖానాను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎలాంటి అవకతవకలు లేవు
ఇప్పటికే ఫార్మా భూసేకరణలో, ఇండ్ల స్థలాల పంపిణీ లో ఎలాంటి అవకతవకలు లేవని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. ఫార్మా ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారంతో పాటు ఎకరాకు 121గజాల స్థలాన్ని అన్ని వసతులతో కూడిన ఎచ్ఎండీఏ వెంచర్లో ఇస్తున్నట్లు తెలిపారు. అక్కడ మున్సిపల్ ఏర్పడడంతో పాటు పాఠశాల, పార్కు, దవాఖాన, రో డ్లు, విద్యుత్, తాగునీరు, మంచినీరు, భూగర్భ డ్రైనేజీ తదితర మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపా రు. దీంతో భూమి కోల్పోయిన ప్రతి రైతుకు రూ.10 నుంచి 13లక్షలు అదనంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్లాట్లపై ఎలాంటి నిబంధనలు ఉండవని, అవసరమైతే తిరిగి అమ్ముకోవచ్చన్నారు. ఫార్మా పరిసరాల్లో లే-అవుట్లు, ఇండ్ల నిర్మాణాలు, వ్యవసాయం చేసుకోవచ్చన్నారు. మండలంలో బఫర్‌జోన్ పుకార్లు శికార్లు అవుతున్నాయని, దానిని రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. పరిశ్రమలతోనే ఇక్కడి ప్రాంతం రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నా రు. ఫార్మా రైతులకు అన్యాయం చేసేది లేదన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

