నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా
పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 77మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
- పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి
పరిగి, డిసెంబర్ 23 : పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 77మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాల సహకారం తీసుకొని పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారికి సంబంధించిన ఫైల్ శరవేగంగా కదులుతుందని తెలిపారు. కార్యక్రమంలో పరిగి జడ్పీటీసీ బి.హరిప్రియ, పరిగి, కులకచర్ల ఎంపీపీలు కరణం అరవిందరావు, సత్యమ్మ, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, తహసీల్దార్ కె.ఆనందరావు పాల్గొన్నారు.
స్వామి వివేకానంద ఆశయ సాధనకు కృషి చేయాలి
వికారాబాద్ : స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పరిగి, తాండూరు శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, యువజన వారోత్సవాల్లో ఇరువురు శాసనసభ్యులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్థానిక అంబేద్కర్ భవనంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించి గ్రూప్ డాన్స్, సాంగ్స్, సోలో డాన్స్, సాంగ్స్, ఫొటోగ్రఫీ, డ్రాయింగ్, వ్యాసరచన, స్పీచ్ పోటీలు యువతకు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్‌రావు, యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల పథకానికి దరఖాస్తుల స్వీకరణ
ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారంటీల పథకానికి ఈనెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆలోచిస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున పరిగిలోని తుంకలగడ్డలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి పాల్గొని క్రిస్మస్ కానుకలు అందజేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు దరఖాస్తులకు సంబంధించి ముఖ్యమంత్రి ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలలో భాగంగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తామని, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇతర సమస్యల పరిష్కారానికి, సంక్షేమ పథకాలు అందించేందుకు నిర్ణయించామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ఆనందరావు, పాస్టర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

