అభివృద్ధి పథంలో మడికట్టు
సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి అంతంతే అన్న సమాధానాలకు.. ప్రస్త్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రధాన పంచాయతీలతో సమానంగా అనుబంధ గ్రామాల్లోనూ
చేవెళ్ల రూరల్, నవంబర్ 29 : సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి అంతంతే అన్న సమాధానాలకు.. ప్రస్త్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రధాన పంచాయతీలతో సమానంగా అనుబంధ గ్రామాల్లోనూ అభివృద్ధి జరుగుతున్నది. మడికుట్ట గ్రామంలో పల్లె ప్రగతి పనులతో పాటు అనేక అభివృద్ధి పనులు పూర్తై అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టులో గతంలో పేరుకుపోయిన సమస్యలన్నీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పనులు పరిష్కారమయ్యాయి.

మౌలిక వసతుల కల్పన..
తంగడిపల్లి గ్రామ జనాభా 3950, ఓటర్లు 2304 ఉన్నారు. అందులో మడికట్టు అనుబంధ గ్రామం జనాభా 650, ఓటర్లు 300 మంది ఉన్నారు. గ్రామ సర్పంచ్ లింగంపల్లి అనూషా సత్తయ్యగౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేందర్‌రావు ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
చేపట్టిన అభివృద్ధి పనులు..
తంగడిపల్లి (అనుబంధగ్రామం మడికట్టు) గ్రామ పంచాయతీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు, సీసీ కెమెరాలు, పంచాయతీలో చెత్త సేకరణకు ట్రాక్టర్, వైకుంఠధామం నిర్మాణం, డంపింగ్ యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు.
అందంగా దర్శనమిస్తున్న వీధులు..
గ్రామంలోని ఏ గల్లీని చూసినా సీసీ రోడ్లు, వీధి దీపాలతో అందంగా దర్శనమిస్తున్నది. పారిశుధ్య నిర్వహణలో రాజీలేకుండా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి తడి, పొడి చెత్తను పంచాయతీ ట్రాక్టర్లో వేసి డంపిండ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆహ్లాదాన్నిస్తున్న హరితహారం మొక్కలు..
ప్రధాన రహదారికి ఇరువైలా, గ్రామ పరిసరాలు, పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్నిస్తున్నాయి. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.
సమాన అభివృద్ధి..
పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో తంగడిపలి,్ల అనుబంధ గ్రామం మడికట్టులో సమానంగా నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టాం. గ్రామాన్ని చూస్తే చాలా సంతృప్తి అనిపిస్తుంది. గతంలోని సమస్యలు పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. సమస్యలపై రాజీ లేకుండా అప్పటికప్పుడే పరిష్కారం చూపుతున్నాం. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం.
– లింగంపల్లి అనూషా సత్తయ్యగౌడ్, తంగడిపల్లి (మడికట్టు) గ్రామ సర్పంచ్
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం..
గతంలో పేరుకుపోయిన.. ఏండ్ల నాటి సమస్యలు పల్లె ప్రగతి పనులతో పరిష్కరించాం. పారిశుధ్యం, మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించి ముందుకు సాగుతున్నాం. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
– సురేందర్ రావు, తంగడిపల్లి (మడికట్టు) పంచాయతీ కార్యదర్శి
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

