పెరుగుతున్న ప్రమాదాలు
ఎన్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడంలేదు.
- పోలీసుల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్న తగ్గని రోడ్డు ప్రమాదాలు
- ఎడాదికేడాది పెరుగుతున్న పాదచారుల మరణాలు
- గతేడాది 110..ప్రస్తుతం 121 మంది మృతి
సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్ని చేసినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వాహనదారుల్లో ఆశించిన మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడంలేదు. అందులోనూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారు. ప్రమాదాల నుంచి పాదచారులను తప్పించేందుకు 31 చోట్ల పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినా.. గతేడాది కంటే ఈ సంవత్సరం మృతు ల సంఖ్య ఎక్కువగానే ఉంది. డ్రంక్అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌ను త గ్గించడం, నిర్లక్ష్యం డ్రైవింగ్‌పై పోలీసులు కొరఢా ఝలిపిస్తున్నారు. 2023లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 121మంది పాదచారులు మృతి చెందారు. 2022లో ఈసంఖ్య 110గా ఉంది.మృతిచెందిన పాదచారుల్లో ఎక్కువ సంఖ్యలో వృద్ధులు, యాచకులే ఉన్నారు.
ఆ తర్వాత ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వారి సంఖ్య కూడా ఉంది. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం వేలాది కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. 2014లో 42 లక్షల వాహనాలు ఉండగా.. 2023లో 83 లక్షలకు పెరిగాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రమాదాలకు కారణమైన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఈ ఏడాది 37,866 కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా.. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా రాగ్ (రోడ్డు యాక్సిడెంట్ అనాలసిస్ గ్రూప్) ను ఏర్పాటు చేసి, ప్రమాదానికి కారణాలను విశ్లేషించి తెలుసుకుంటున్నారు. సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా 65 చోట్లను ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.
ఎన్ఫోర్స్మెంట్ శాతం పెరిగినా..!
ట్రాఫిక్ సాఫీగా వెళ్లే విధంగా చేస్తూ వాహనదారులు పక్కాగా నిబంధనలు పాటించే విధంగా అవగాహన తేవడం, నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు నమోదు చేస్తూ ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు అర్ధరాత్రి తరువాత ఎక్కువగా జరుగుతున్నాయి.
దీంతో అర్ధరాత్రి సమయంలో అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్‌పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అతివేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో 2023లో అర్ధరాత్రి తరువాత 1,11,736 కేసులు నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ 2022తో పోలిస్తే, 2023లో 7 శాతం పెరిగింది.
పాదచారులు మృతుల సంఖ్య
60 ఏండ్లకు పైబడిన వారు 23
యాచకులు 23
వాకర్స్ 18
విజిటర్స్ 3
ఇతరులు 54
కేసుల నమోదు సంఖ్య
2022 46,42,357
2023 47,25,089
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

