ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలలి
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు కడితే ఊరుకోం
- కందుకూరు కృతజ్ఞతా సభలోమాజీ మంత్రి , మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
కందుకూరు, డిసెంబర్ 29 : ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతాసభకు ఆమె హాజరయ్యారు. అంతకుముందు హైదరాబాద్, శ్రీశైలం రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కందుకూరు వరకు మెట్రో తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఫార్మాసిటీ, మెట్రోను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం భావ్యం కాదన్నా రు. ప్రజాపాలనలో ప్రజలు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను కడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్నికల సమయం లో రైతుబంధును ఆపారని, ఇప్పడు రైతులకు వేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అన్ని పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెప్పి ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తరచూ అప్పులంటూ ఆరు గ్యారెంటీలు, హామీలను పక్కన పట్టడానికి ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. మెగాసిటీ వస్తే యువకులకు ఉద్యోగాలు వస్తా యా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సింహ, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మీనర్సింహా రెడ్డి, అంజయ్యగౌడ్, బాలకృష్ణ, అధ్యక్షురాలు ఇందిరమ్మ, నాయకులు దేవేందర్, అమరేందర్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, యూత్ నాయకులు కార్తిక్, విఘ్నేశ్వర్‌రెడ్డి, దీక్షిత్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

