కొడంగల్ అప్పుడెట్లుండె..ఇప్పుడెట్లయింది
కాంగ్రెస్‌కు ఓటేస్తే.. సంక్షేమం, అభివృద్ధి ఆగం కావడం ఖాయ మని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్, నవంబరు 17: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. సంక్షేమం, అభివృద్ధి ఆగం కావడం ఖాయ మని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018కి ముందు కొడంగల్ ఏవిధంగా ఉండేది..? నేడు ఏవిధంగా మారిందో ప్రజలే గుర్తించాలన్నారు. కొడంగల్ మున్సిపాలిటీగా ఏర్పడి రూ.100కోట్లతో అభివృద్ధి పనులు జరిగి నేడు వీధుల్లో పెద్ద సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వంటి ఎన్నో సదుపాయాలు ఏర్పడినట్లు పేర్కొన్నారు.
గతంలో రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో గెలిచి హైదరాబాద్‌లో మకాం వేసి ఇక్కడి అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో లేకుండా, కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తూ కోట్లు గడించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని నోటికి వచ్చిందల్లా తిట్టి, వంద మీటర్ల లోతులో పాతిపెడతానని శపథం చేసిన విషయాన్ని కొడంగల్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు.
రైతు బంధు పథకం నేడు వ్యవసాయాన్ని పండుగ చేసిందని, ఒక్క కొడంగల్ మున్సిపాలిటీలోనే ఐడేండ్లల్లో 2062 మంది రైతులకు గాను రూ.31కోట్ల 36లక్షలు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. ప్రతి నెల కొడంగల్ మున్సిపాలిటీలో రూ.32లక్షలు మంజూరు అవుతున్నట్లు పేర్కొన్నారు. రైతు బీమా పథకం క్రింద 41 మందికి రూ. 2కోట్లు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఇప్పటి వరకు కొడంగల్ మున్సిపాటిలో ఐదువందల మంది వివాహాలకు గాను రూ.4కోట్ల 61లక్షలు అందినట్లు తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ పథకం కింద115మందికి గాను రూ.కోటి 63లక్షలు అందించడం జరిగిందన్నారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి అభివృద్ధి, సంక్షేమానికి సహ కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రానున్నది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వేంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీవాణి, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌రావు యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు రమేశ్‌బాబు, నవాజొద్దీన్, డా.కన్నోకి వెంకటేశ్వర్లు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

