బషీరాబాద్, జనవరి 19 : ఊరూరా జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో నిర్వహించిన జెండా పండుగ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి జెండా ఆవిష్కరించి వెళ్లిపోగానే గ్రామంలోని కాంగ్రెస్ లీడర్లు రెండు వర్గాలుగా విడిపోయి తోసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో మేము ముందా… మీరు ముందా, మీరు మొన్న వచ్చి పెత్తనం చేయడం ఏమిటని ఒక వర్గానికి చెందిన కొంత మంది మరో వర్గానికి చెందిన వారి కాలర్లు పట్టుకుని కొట్టుకునే దశకు వెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలను పక్కకు లాగారు.