పాల ఉత్పత్తిలో జాగ్రత్తలు తప్పనిసరి
చలి ప్రజలనే కాదు పశువులనూ వేధిస్తున్నది. దీంతో పాల దిగుబడి తగ్గుతున్నది. మండలంలోని కుమ్మరిగూడ, నాగరకుంట, తిమ్మారెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ, తిర్మలాపూర్, బోడంపహాడ్, షాబాద్, కక్కులూర్, కుర్వగూడ, కేశారం, తాళ్లపల్లి, నాందార్ఖాన్పేట్ తదితర గ్రామాల్లో రైతులు అత్యధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.
- చలి పెరుగడంతో 20 శాతం వరకు తగ్గిన పాల దిగుబడి
- సలహాలు, సూచనలు పాటించాలంటున్న పశువైద్యులు
షాబాద్, డిసెంబర్ 16 : చలి ప్రజలనే కాదు పశువులనూ వేధిస్తున్నది. దీంతో పాల దిగుబడి తగ్గుతున్నది. మండలంలోని కుమ్మరిగూడ, నాగరకుంట, తిమ్మారెడ్డిగూడ, మల్లారెడ్డిగూడ, తిర్మలాపూర్, బోడంపహాడ్, షాబాద్, కక్కులూర్, కుర్వగూడ, కేశారం, తాళ్లపల్లి, నాందార్ఖాన్పేట్ తదితర గ్రామాల్లో రైతులు అత్యధికంగా పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. గత వా రం రోజులుగా చలి ప్రభావంతో పాడి ఆవులు, గేదెలు పాలు తక్కువగా ఇస్తున్నాయి.
20 శాతం తగ్గిన పాల దిగుబడి..
చలికాలం ఆరంభంలోనే ఒక్కసారిగా పాల దిగుబడి సగానికి తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాడి ఆవులు, గేదెలకు గతంలో ఏ విధమైన పశుగ్రాసం, దాణా ఇస్తున్నా రో ప్రస్తుతం కూడా అవే ఇస్తున్నారు. గతంలో కంటే ఖర్చులు పెరిగినా పాల దిగుబడి మాత్రం తగ్గడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. చలికాలంలో పాల ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గుతుందని.. ఉత్పత్తి మరింత తగ్గకుండా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రతలు..
పాడి ఆవులు, గేదెలు అనారోగ్యానికి గురైతే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నాణ్యమైన ఎండు, వరి గడ్డి, జొన్న లాంటివి వాటికి మేతగా వేయాలి. మినరల్ మిక్షర్ లాంటివి ఎక్కువగా తినిపించాలి. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా ఉండే దాణాను తినిపించాలి. ఈ కాలంలో పశువులు రోగాల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలి. పశువుల పాకలోకి గోమార్లు రా కుండా చూడాలి. పాకల్లో పా త మట్టిని తీసి కొత్త మట్టిని వేయాలి. పశుగ్రాసంలో ఏపీబీఎన్, లూసన్ తదితర పచ్చిగడ్డి ఈ కాలం లో తక్కువగా పెరుగుతాయి. అందువల్ల వా టిని ఎక్కువ మొత్తం గా సాగు చేసుకుంటే పశుగ్రాసం కొరత తీరుతుంది. ఉద యం, సాయం త్రం వేళల్లో చలిలో పశువులను బయటకు తీసుకెళ్లొద్దు. ఆ ప్రభావం పాల ఉత్పత్తిపై పడుతుంది.
చలికి పాలు తగ్గాయి
గత వారం రోజులుగా చలి ఎక్కువగా ఉండడంతో పాల దిగుబడి తగ్గింది. నా వద్ద పది ఆవులున్నాయి. ప్రతిరోజూ 70 లీటర్ల వర కు పాల దిగుబడి వచ్చేది. ప్రస్తుతం చలి తీవ్రతకు ఒక్కసారిగా 20 లీటర్ల పా లు తగ్గాయి. చలికి ఆవులు అనారోగ్యానికి గురవుతున్నాయి. డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తున్నా.
-అంజయ్య, పాడి రైతు కుమ్మరిగూడ
చలి కాలంలో రైతులు పాల ఉత్పత్తిలో జాగ్రత్తలు పాటిస్తేనే మేలు. పశువులకు వరిగడ్డి, జొన్న, సొప్పలాంటి ఎండు మేత పెట్టాలి. మినరల్ మిక్షర్ తినిపించాలి. పాకల్లోకి గోమార్లు రాకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో 6 గంటలకు పాలు పితికితే పాల ఉత్పత్తి అదుపులో ఉంటుంది.
-చంద్రశేఖర్రెడ్డి, పశువైద్యాధికారి, రేగడిదోస్వాడ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
- Tags
- buffalo milk
- Cattle
- cows
- milk
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

