విషాదం : నీటి సంపులో పడి బాలుడు మృతి
కుత్బుల్లాపూర్,మే12 : ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఒడిషా రాష్ర్టానికి చెందిన అమర్దాస్, ఎమిన్దాస్ దంపతులు గత పదేళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.
నగర శివారు గుండ్లపోచంపల్లిలోని ఎస్సీ కాలనీలో అద్దెకు నివాసం ఉంటూ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ వారి ఇద్దరు పిల్లలతో గడుపుతున్నారు. ఎమిన్దాస్ రోజువారి పనులో భాగంగా ఉదయం పనికి వెళ్లింది. తన భర్త అమర్దాస్ ఇంట్లో తన పదేళ్ల పెద్దకొడుకుతో పాటు కృష్ణదాస్(2)తో కలిసి ఉన్నారు. పెద్దకొడుకు జ్వరం రాగా పడుకొని ఉండగా మధ్యాహ్నం సమయంలో అమర్దాస్ మద్యం సేవించేందుకు బయటకు వెళ్లాడు.
చిన్న కొడుకు కృష్ణదాస్ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న సంపులో పడి మృతి చెందాడు. బయటకు వెళ్లి తిరిగి వచ్చిన తండ్రి అమర్దాస్కు సంపులో తేలి ఉన్న కొడుకు మృతదేహన్ని చూసి బోరున విలపించడంతో స్థానికుల సహాయంతో బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

