దూలపల్లి చెరువులో ఇద్దరు బాలికలు గల్లంతు

కుత్బుల్లాపూర్, మే 31 : ఇద్దరు బాలికలు చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి గ్రామం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన సంజన(13), కరీనా(12) సాయంత్రం సమయంలో గ్రామ శివారులో ఉన్న చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. కాగా చెరువు గట్టుపై బాలికల దుస్తులు, చెప్పులు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ప్రమాదవశత్తు జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు చెరువులో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటనలో సంజన మృతదేహాం లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో విరమించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

