ఓపెన్ నాలాల్లో చెత్తకు చెక్

కుత్బుల్లాపూర్, మార్చి17 : ఓపెన్ నాలా కన్పిస్తే చాలు. దాని పరివాహక ప్రాంతాల జనాలంతా చెత్తను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వేస్తారు. నాలాల్లో చెత్తను వేయడంతో మురుగునీరు సాఫీగా వెళ్లడంలేదు. ఫలితంగా ఎక్కడికక్కడే నాలాల్లో చెత్త కుప్పలుతెప్పలుగా పేరుకుపోతుంది. అనేకమార్లు నాలాలో చెత్తను వేయరాదని సిబ్బంది హెచ్చరించినా.. ప్రజల్లో మార్పురాకపోవడంతో కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జనవాసాల్లో ఉన్న ఓపెన్ నాలాలకు కొంత ఎత్తుగా జాలీలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో చెత్తను నాలాల్లో వేయడం ఆగడంతో పాటు నాలా నుంచి రక్షణగా కూడా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జనవాసాల సమీపంలో ఏర్పాట్లు..
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ప్రతి యేటా జనవాసాల మధ్య ఉండే నాలాలో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోయి దర్శనమిస్తుంది. దీని ఫలితంగా ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకమారు నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు అధికారులు ప్రత్యేక టెండర్ ద్వారా తొలగించడం తలకు మించిన భారంగా మారుతుంది. దీంతో జాలీల ఏర్పాటుతో కొంత మేరకు ఉపశమనం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల డివిజన్ పరిధిలో ఉన్న ప్రధాన నాలాకు రక్షణగా కుత్బుల్లాపూర్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నాలాలకు జాలీలను ఏర్పాటు చేస్తున్నారు.
ఖర్చును తగ్గించి.. రక్షణ పెంచి..
నాలాలో పేరుకుపోయే చెత్తాచెదారాన్ని తొలగించేందుకు అవుతున్న ఖర్చును తగ్గించుకోనేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతేకాకుండా.. ఓపెన్ నాలాల ద్వారా ఎప్పుడు ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో తెలియని పరిస్థితిలో ఇప్పుడు మరింత రక్షణ కల్పించేందుకు జాలీలు అడ్డుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఓపెన్ నాలాకు ఆనుకొని ఉండే రోడ్ల పక్కన చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోవడం సహజంగా కనిపిస్తుంది. దీనికి తోడు రాత్రి సమయంలో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదవశాత్తు నాలాలో పడిన సంఘటనలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. అలాంటి వాటికి తావులేకుండా మరింత రక్షణగా జాలీలు పని చేస్తాయని తెలుపుతున్నారు.
పకడ్బందీగా చర్యలు
ప్రధానంగా నాలాలో చెత్తను వేయకుండా ఉండటంతో పాటు ప్రమాదాలు కూడా సంభవించకుండా ఉండేందుకు రక్షణగా జాలీలను ఏర్పాటు చేస్తున్నాం. ఓపెన్ నాలాలకు జాలీలు, అండర్ లైన్ నాలాలకు కప్పులను ఏర్పాటు చేస్తున్నాం. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. జనవాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. – కృష్ణప్రసాద్, ఈఈ కుత్బుల్లాపూర్ సర్కిల్
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- open nala
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

