Attempt murder : ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌పై హత్యాయత్నం
Attempt murder | మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరారంలో హరిప్రసాద్ అనే వ్యక్తి భవ్యసాయి పాఠశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నాడు. శనివారం రాత్రి పదిన్నర సమయంలో పాఠశాలకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి అతడిని అడ్డగించి కత్తితో మొహం, మెడ, ఛాతీపై పొడిచాడు. స్థానికులు కేకలు వేయడంతో దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

