వికారాబాద్, ఏప్రిల్ 2 : వికారాబాద్‌లోని గౌలికర్ ఫంక్షన్‌హాలులో నేడు జరిగే నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని సీనియర్ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.