హిల్ట్‌పై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు, రేపు పారిశ్రామికవాడలో కేటీఆర్, హరీశ్‌రావు పర్యటన
నేడు, రేపు పారిశ్రామికవాడలో కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనగ్రేటర్ హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరు బాట పట్టింది.
సిటీ బ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) ; గ్రేటర్ హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పోరు బాట పట్టింది.నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్ని పారిశ్రామిక వాడలను సందర్శించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ సీనియర్ నాయకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాలను నియమించారు. వారంతా నేడు, రేపు పారిశ్రామిక వాడల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. ఈ మేరకు పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించారు.
క్లస్టర్ల వారీగా పర్యటనలు
- క్లస్టర్-1లో మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గంగుల కమలాకర్, దేశపతి శ్రీనివాస్, మెదక్ ఎమ్మెల్యేల బృందం పాశమైలారం, పటాన్చెరు, రామచంద్రపురం ప్రాంతాలను సందర్శిస్తారు.
- క్లస్టర్-2లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సురభివాణీదేవి, ఉప్పల్ నాయకులు కలిసి నాచారం, మల్లాపూర్, ఉప్పల్, చర్లపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తారు.
- క్లస్టర్-3లో మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, రవీందర్రావు మౌలాలి, కుషాయిగూడ ప్రాంతాలను సందర్శిస్తారు.
- క్లస్టర్-4లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద కలిసి జీడిమెట్ల, కూకట్‌పల్లిలో పర్యటిస్తారు.
- క్లస్టర్-5లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నవీన్‌రావు సనత్‌నగర్, బాలానగర్ ప్రాంతాలను పరిశీలిస్తారు.
- క్లస్టర్-6లో చామకూర మల్లారెడ్డి, శంభీపూర్ రాజు సహా నాయకులు మేడ్చల్ ఇండస్ట్రియల్ పార్కును సందర్శిస్తారు.
- క్లస్టర్-7లో సబితా ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, స్వామి గౌడ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి కలిసి కాటేదాన్, హయత్‌నగర్‌లో పర్యటిస్తారు.
- క్లస్టర్-8లో మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, దాసోజు శ్రవణ్, ఎండీ సలీం కలిసి చందూలాల్ బారాదరి పారిశ్రామిక వాడలను సందర్శి స్తారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

