69 సంవత్సరాలు.. 63 అడుగులు
దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు.
- 15న నేత్రాలంకరణ
- 18 నుంచి భక్తులకు దర్శనం
ఖైరతాబాద్, సెప్టెంబర్ 13: దశ మహా విద్యాస్వరూపుడు దర్శనానికి ముస్తాబవుతున్నాడు. ప్రతి ఏడాది తీరొక్క రూపంలో దర్శనమిచ్చే స్వామి వారిని ఈ ఏడాది వైవిధ్యభరితమైన రూపంలో తీర్చిదిద్దారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఈ ఏడాది 63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారు. ఈ సంవత్సరం మహాకాయుడు సరస్వతి, వారాహి అమ్మవార్లతో దశహస్తుడై దర్శనమిస్తున్నారు. అలాగే ఉప మండపాల్లో కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీనరసింహ స్వామి, ఎడమ వైపు శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించారు. ఈ నెల 15న నేత్రాలంకరణతో విగ్రహం పూర్తి అవుతుందని, 18న వినాయక చవితి సందర్భంగా ఉదయం తొలిపూజ, ప్రాణప్రతిష్ఠతో స్వామి వారి దర్శనం ప్రారంభమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది.
ప్రత్యేకతలు…
దశ మహా విద్యా గణపతికి అనేక ప్రత్యేకతలున్నాయి. స్వామి వారి విగ్రహ నమూనాను ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా రూపొందించారు. శిల్పి రాజేంద్రన్ పర్యవేక్షణలో, గ్రాఫిక్ డిజైనర్ శరత్ నల్లనాగుల విగ్రహానికి రూపకల్పన చేశారు. ఏడుపడగల ఆదిశేషుడి నీడలో దశ హస్తుడై మహాగణపతి దర్శనమిస్తారు. కుడివైపు అంకుశం, త్రిశూలం, ధాన్యం, రుద్రాక్ష, ఆశీర్వాదం, ఎడమ వైపు పాశం, ఖడ్గం, దారం, గ్రంథం, లడ్డూ, తొండంలో కలశం ధరించి ఉంటారు. స్వామి వారి వెనుక వైపు దశ మహాగ్రంథం, పాదాల వద్ద మూషికం ఉంటాయి.
విగ్రహ నిర్మాణానికి 120 మంది కళాకారులు..
63 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పు కలిగిన దశముఖుడి నిర్మాణం కోసం శిల్పి రాజేంద్రన్ నేతృత్వంలో 120 మంది కళాకారులు పనిచేశారు. విగ్రహ రూపకల్పనకు 20 టన్నుల నాణ్యమైన స్టీలును వాడారు. దీంతో పాటు 25 బండిళ్ల మెష్, రెండు డీసీఎంల వరి గడ్డి, 20 బస్తాల వరిపొట్టు, 500 కేజీల సుతిలి పొడి, రెండు ట్రాక్టర్ల ఇసుక, 2వేల మీటర్ల గోనె సంచులు, 25వేల మీటర్ల కోర బట్ట, 20 బస్తాల సున్నం పొడి, 50 కేజీల పెప్పర్ పొడి వినియోగించారు. విగ్రహ నిర్మాణానికి రాష్ట్రంలోని 15 మందితో పాటు చెన్నై నుంచి 30, ఒడిశా నుంచి 20, మహారాష్ట్ర నుంచి 20, పశ్చిమ బెంగాల్ నుంచి 15 మంది కళాకారులు, మరో 20 మంది పెయింటర్లు మూడు నెలల పాటు శ్రమించారు. విగ్రహం మొత్తానికి సహజమైన రంగులు వాడటం విశేషం.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

