ఆడపడుచుల జీవితాల్లో కల్యాణలక్ష్మి వెలుగులు
ఆడపిల్ల పెండ్లి పేద కుటుంబానికి భారం కావొద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప మనసు ముఖ్యమంత్రి కేసీఆర్‌ది.
- నిరుపేద ఆడపడుచుల జీవితాల్లో కల్యాణలక్ష్మి వెలుగులు
- ఆడబిడ్డ పెండ్లికి రూ.1,00,116 సాయం
- 26 గ్రామాల్లో 98 మంది లబ్ధిదారులకు రూ.98,11,368 విలువ చేసే చెక్కులు అందజేత
పెద్దేముల్, జనవరి 29 : ఆడపిల్ల పెండ్లి పేద కుటుంబానికి భారం కావొద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప మనసు ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. పేదింటి ఆడపడుచుల పెండ్లికి ఆర్థిక సాయం అందించి వారి జీవితాల్లో కల్యాణ వెలుగులు నింపుతున్నారు. గతంలో తల్లిదండ్రులు ఆడపిల్లల పెండ్లి చేయడానికి పలు ఇబ్బందులు పడేవారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక సతమతమయ్యేవారు. సమయానికి అప్పులు తీర్చక కొందరు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నిరుపేద ఆడపడుచుల పెండ్లికి రూ.1,00,116 ఆర్థిక సాయం అందుతుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో రూ.98 లక్షల ఆర్థిక సాయం
తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచుల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మండలంలో ఇప్పటివరకు 26 గ్రామాల్లో 98 మంది లబ్ధిదారులకు రూ.98,11,368 ఆర్థిక సాయం అందజేసింది. వారిలో ఎస్టీ లబ్ధిదారులు 41మందికి రూ.41,04,756, ఎస్సీలు 19 మందికి రూ.19,02,204, బీసీలు 33 మందికి రూ.33,03,828, మైనారిటీలు ఐదుగురికి రూ.5,00,580 ఆర్థికసాయం అందజేసినది.
ఆర్థికసాయం పొందాలంటే..
తల్లిదండ్రులు తమ పిల్లల పెండ్లికి సంబంధించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంలో రూ.1,00,116 ఆర్థికసాయం పొందాలంటే తప్పనిసరిగా పలు రకాల ధ్రువపత్రాలను అధికారులకు సమర్పించాలి. వాటిలో పెండ్లి పత్రిక, పెండ్లి ఫొటో, అమ్మాయి పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఆధార్‌కార్డు, అమ్మాయి కులం, ఆదాయ సర్టిఫికెట్, మొదటి పెండ్లి సర్టిఫికెట్ చదివి ఉంటే ఇద్దరివి (వధువు, వరుడివి), ఎస్సెస్సీ మెమోలు, బొనఫైడ్ సర్టిఫికెట్, అబ్బాయి ఆధార్ కార్డు, అబ్బాయి కులం, ఆదాయం సర్టిఫికెట్, అమ్మాయి తల్లి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్, అమ్మాయి దివ్యాంగురాలైతే సదరం సర్టిఫికెట్, బ్యాంకు ఖాతా బుక్ తదితర ధ్రువపత్రాలను మండల రెవెన్యూ అధికారులకు, స్థానిక మీ-సేవా కేంద్రంలో అందించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీలించి, నేరుగా వారి ఇండ్ల వద్దకు వెళ్లి గ్రామస్తులతో జరిగిన పెండ్లిపై ఆరా తీస్తారు. పంచనామా పూర్తిచేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
పెద్ద మనస్సుతో ఆదుకొంటున్నారు..
తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నిరుపేద ఆడపడుచులు, తల్లిదండ్రులను పెద్ద మనస్సుతో ఆదుకొంటున్నారు. నా కూతురుకు ఇటీవలే పెండ్లి చేశా. అన్ని రకాల ధ్రువపత్రాలతో కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశా. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందజేసిన కొన్ని రోజులకే రూ.1,00,116 ఆర్థిక సాయం అందినది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. త్వరగా సాయం అందజేసిన అధికారులకు కృతజ్ఞతలు.
– మంగలి అమృతమ్మ, లబ్ధిదారు, మారేపల్లి, పెద్దేముల్
మేనమామగా మారిన సీఎం కేసీఆర్..
ఎంతో మంది నిరుపేద ఆడపడుచులకు సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వివాహాలకు ఆర్థిక సాయం అందించి వారికి మేనమామగా మారారు. ఒకప్పుడు మాలాంటి నిరుపేద తల్లిదండ్రులు ఆడపిల్లల పెండ్లి చేయాలంటే నానా ఇబ్బందులు పడేవారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఆ బాధ పూర్తిగా తప్పిపోయి చాలా సంతోషంగా ఉన్నాం.
– జెర్పుల దేవ్లీ బాయి, లబ్ధిదారు, కందనెల్లి తండా, పెద్దేముల్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

