మహిళా సంఘాలకు వడ్డీ డబ్బులు
మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది.
- జిల్లాలో 9802 సంఘాలకు రూ.7.95 కోట్లు మంజూరు
బొంరాస్‌పేట, జూన్ 25 : మహిళా సంఘాలు ఊరటచెందే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సంఘాలు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం తిగిరి వారి వారి ఖాతాలలో జమ చేసింది. వికారాబాద్ జిల్లాలోని 9802 మహిళా సంఘాలకు గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు నాలుగు నెలలకు సంబంధించిరూ.7.95 కోట్లను ప్రభుత్వం మహిళా సంఘాల ఖాతాలలో జమ చేసింది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వాటికి బ్యాంకు లింకేజీ ద్వారా, స్త్రీనిధి ద్వారా వడ్డీలేని రుణాలను అందిస్తుంది.
వాయిదాల ప్రకారం మహిళా సంఘాల సభ్యులు ప్రతినెలా కొంత అసలు, వడ్డీ చెల్లించాలి. పేద మహిళలకు వడ్డీ భారం కావద్దన్న ఉద్దేశంతో ప్రతినెలా సక్రమంగా రుణాలు తిరిగి చెల్లిస్తున్న సంఘాలకు వడ్డీని తిరిగి చెల్లిస్తుంది. చాలా ఏళ్ల నుంచి నిలిచిపోయిన వడ్డీ చెల్లింపులు ఖాతాలలో జమ చేయడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రుణాలు చెల్లిస్తున్న సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీని చెల్లిస్తుండడంతో మహిళలు మరింత చైతన్యంగా తమ ఆర్థిక కార్యకలాపాలను చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వడ్డీలేని రుణాలు తీసుకున్న మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని స్వయం స్వావలంబన సాధిస్తున్నారు.
9802 సంఘాలకు రూ.7.95 కోట్లు..
వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో రుణాలను సకాలంలో చెల్లించిన 9802 మహిళా సంఘాలకు ప్రభుత్వం రూ.7.95 కోట్ల వడ్డీని వారి ఖాతాలలో జమ చేసింది. బంట్వారం మండలంలోని 339 సంఘాలకు రూ.31 లక్షలు, బషీరాబాద్‌లోని 458 సంఘాలకు రూ.37 లక్షలు, బొంరాస్‌పేటలోని 586 సంఘాలకు రూ.45 లక్షలు, చౌడాపూర్‌లోని 152 సంఘాలకు రూ.13 లక్షలు, ధారూరు మండలంలోని 388 సంఘాలకు రూ.32 లక్షలు, దోమ మండలంలోని 737 సంఘాలకు రూ.61 లక్షలు, దౌల్తాబాద్ మండలంలోని 524 సంఘాలకు రూ.41 లక్షలు, కొడంగల్‌లోని 422 సంఘాలకు రూ.35 లక్షలు, కోట్‌పల్లిలో 379 సంఘాలకు రూ.37 లక్షలు, కులకచర్లలో 937 సంఘాలకు రూ.75 లక్షలు, మర్పల్లిలో 688 సంఘాలకు రూ.62 లక్షలు, మోమిన్‌పేటలో 605 సంఘాలకు రూ.48 లక్షలు, నవాబుపేటలో 561 సంఘాలకు రూ.34 లక్షలు, పరిగిలో 542 సంఘాలకు రూ.48 లక్షలు, పెద్దెముల్‌లో 504 సంఘాలకు రూ.39 లక్షలు, పూడూరులో 412 సంఘాలకు రూ.35 లక్షలు, తాండూరులో 671 సంఘాలకు రూ.55 లక్షలు, వికారాబాద్‌లో 274 సంఘాలకు రూ.17 లక్షలు, యాలాల మండలంలోని 623 మహిళా సంఘాలకు రూ.53 లక్షల వడ్డీని ప్రభుత్వం మంజూరు చేసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

