ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో సందర్శన
ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, కల్పించిన మౌలిక వసతులను ప్రత్యేకంగా పరిశీలించింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ఎయిర్‌పోర్టు మెట్రో సౌకర్యాలు, కార్యకలాపాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. శనివారం ఢిల్లీ వెళ్లిన హైదరాబాద్ మెట్రో రైలు బృందం అక్కడి మెట్రో ప్రాజెక్టు నిర్వహణ, కల్పించిన మౌలిక వసతులను ప్రత్యేకంగా పరిశీలించిం ది. రెండు సిటీ మెట్రో స్టేషన్లలో చెక్ ఇన్ చేసే విధానం అమల్లో ఉన్నట్లు తెలుసుకున్నది. అదేవిధంగా విమానాశ్రయానికి బదిలీ చేసిన సామాను విమానాశ్రయం వైపు బదిలీకి సంబంధించిన సౌకర్యాలను, ఇతర కార్యకలాపాలను ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తనిఖీ చేశారు.
అనంతరం ఆయన తన బృందంతో న్యూఢిల్లీ స్టేషన్‌కు ప్రయా ణం చేశారు. న్యూఢిల్లీ స్టేషన్లో నగరం వైపు చెక్ ఇన్ సౌకర్యాన్ని పరిశీలించారు. ఢిల్లీ చుట్టుపకల ఉన్న వివిధ పట్టణాలు,నగరాలకు హై స్పీడ్ రైలు కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్న రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కొనసాగుతున్న పనులతో పాటు ఎయిర్‌పోర్టు మెట్రో నిర్వహణ డిపో , ఇతర సౌకర్యాలను కూడా ఈ బృందం పరిశీలించింది. చివరకు ఎన్వీఎస్రెడ్డి ఆయన బృందం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ వికాస్ కుమార్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎండీవీకే సింగ్, సీనియర్ ఇంజినీర్ల బృందాలతో పరస్పర అనుభవాలను పంచుకున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

