ఆఫీసుకు తాళం వేశాడని ఏఈవోపై క్రమశిక్షణ చర్యలు

పెద్దేముల్ : మండల పరిధిలో క్లస్టర్ల వారీగా పనిచేసే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ హద్దు మీరితే వేటు తప్పదని మండల వ్యవసాయ అధికారి ( ఏఈవో ) షేక్ నజీరొద్దీన్ హెచ్చరించారు.
శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకే వ్యవసాయ అధికారి కార్యాలయానికి తాళం వేసి ఉండడం అనే విషయంపై శనివారం దిన పత్రికలో ప్రచురితం అయింది. కథనానికి ఏఓ షేక్ నజీరొద్దీన్ స్పందిస్తూ పెద్దేముల్ క్లస్టర్ ఏఈఓ వినయ్‌పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ షేక్ నజీరొద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం నియమనిబంధనల ప్రకారం.. మండల పరిధిలోని ఆయా గ్రామాల క్లస్టర్లలో పనిచేసే ఏఈఓలు తప్పనిసరిగా తమ తమ క్లస్టర్లలో ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారించరాదని కాదని ఎవరైనా అలా వ్యవహారించి హద్దు మిరితే వేటు తప్పదన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

