రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం హోలీ సంబురాలు అంబరన్నంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారు.
రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అక్కడక్కడా యువకులు డీజేలు, బ్యాండ్లను ఏర్పాటు చేసి డ్యాన్స్‌లు చేశారు. పలుచోట్ల ఆదివారం రాత్రి గ్రామాల్లో కామ దహనం చేశారు.