ఆస్తులు, భవనాల సర్వేకు బల్దియా సిద్ధం
గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్ చేయాలన్న కేంద్ర సర్కారు ఆదేశాలతో.. ఐటీ విభాగం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
- 18 నెలల పాటు కొనసాగనున్న జీఐఎస్ ఆధారిత సర్వే
- నియో జియో ఏజెన్సీకి బాధ్యతలు అప్పగింత
సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్ చేయాలన్న కేంద్ర సర్కారు ఆదేశాలతో.. ఐటీ విభాగం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అర్హత కలిగిన నియో జియో ఏజెన్సీకి సర్వే బాధ్యతలు అప్పగించింది. 18 నెలల పాటు సర్వే చేసి..రెండేండ్ల పాటు సదరు ఏజెన్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహించనున్నది. ఈ సర్వేలో గ్రేటర్లో అసలు నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? వాటిలోని అంతస్తులు, ఎత్తు, విస్తీర్ణం, ఇతరత్రా వివరాలపై డిజిటల్ రికార్డులు రూపుదిద్దుకోనున్నాయి. ప్రతి భవనం సరిహద్దులను తెలుసుకునేందుకు సిటిజన్ సెంట్రిక్ సర్వీస్‌తో ఉపగ్రహ డేటా, డ్రోన్లను ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. సర్వే వివరాలను ఏ రోజుకు ఆ రోజు సంబంధిత సర్కిల్ అధికారులు సమాచారాన్ని చేరుస్తారు. తద్వారా ఆస్తిపన్ను ఆదాయం పెరుగుతుందని, మౌలిక సౌకర్యాల కల్పనకు నగరాభివృద్ధి ప్రణాళికలకు ఈ సమాచారం ఉపయోగపడనున్నదని అధికారులు తెలిపారు.
క్లిక్ చేస్తే సమగ్ర వివరాలు..
జీఐఎస్ ఆధారిత సర్వే ఇప్పటికే మహారాష్ట్రలోని బృహన్, ముంబై కార్పొరేషన్ అమలు చేస్తున్నది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అధికారులు అక్కడి పనితీరును పరిశీలించి వచ్చి నగరంలో అమలుకు సిద్ధమయ్యారు. దాదాపు 20 లక్షల ఇండ్లను సర్వే చేయనున్నారు. ముఖ్యంగా ఇంటి నంబర్లు, వీధులు, కాలనీలను గుర్తించేలా సర్వే ఉంటుంది. ప్రతి ఇంటిని దగ్గర నుంచి చూసీనట్లు 3డీ పటాలుంటాయి. క్లిక్ చేస్తే.. నిర్మాణం , ఎన్ని అంతస్తుల్లో ఉన్నది? ఎంత విస్తీర్ణం వంటి వివరాలు తెలుస్తాయి. సమగ్ర డిజిటల్ పటాలతో ఆస్తిపన్ను ఎక్కువగా వసూలయ్యే ఇండ్లు, తక్కువగా చెల్లించేవి.. పన్ను పరిధిలో లేని కట్టడాలను గుర్తించవచ్చు. నివాస అనుమతుల భవనాల్లో వాణిజ్య కార్యకలాపాలున్నాయా అనేది తెలుసుకునే వీలుంటుంది. పన్ను విధింపులో అవకతవకలు వెలుగులోకి వస్తాయి.
17 లక్షలకు పైగా భవనాలు..
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పరిధిలోని భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ. 2500 కోట్ల మేర రావాల్సి ఉందని అంచనా. అసెస్‌మెంట్లలోనూ అక్రమాలతో వాస్తవంగా చెల్లించాల్సిన ఆస్తిపన్ను కంటే తక్కువగా చెల్లిస్తున్నారు. సర్వేలో భాగంగా వరద నాలాలు, మురుగునీటి నాలాలు, రహదారులు, చెరువులు, తాగునీటి పైపులైన్లు, విద్యుత్, మురుగునీటి లైన్లు, అపార్ట్మెంట్లు, గృహాలు, వాణిజ్య సముదాయాలు, పార్కులు, పచ్చదనం, దవాఖానలు, విద్యా పరిశోధన సంస్థలు, ఖాళీ సంస్థలు, డివిజన్లు, వాటి సరిహద్దులు వంటి అనేక రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

