కొండాపూర్/ ఉప్పల్, జనవరి 13 : మాదాపూర్, ఉప్పల్ శిల్పారామంలో శుక్రవారం సంక్రాంతి సంబురాలు సందడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల హరి కీర్తనలు, బుడబుక్కల, జంగమదేవరుల గారడీ మాటలు, పిట్టలదొర పిట్ట కథలు, ఎరుకలసాని సోది మాటలతో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు ఆంపి థియేటర్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సందర్శకులు ఎండ్లబండి, బోటింగ్, బ్యాటరీ కార్లలో సవారీ చేస్తూ సందడి చేశారు.