వికారాబాద్, జనవరి 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న వివిధ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 4లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
డిగ్రీ, పీజీ కోర్సులు పూర్తి చేసిన ఎస్స్సీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. కోచింగ్ సమయంలో వారికి మధ్యాహ్న భోజన సదుపాయంతో పాటు ఉచితంగా అవసరమైన స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ యువతీ, యువకులు ఆన్లైన్లో www.tsstudycircle.co.in లో దరఖాస్తు నమోదు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మాత్రమే స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 9573859268 ఫోన్ చేయాలన్నారు.