Crime : హైదరాబాద్ చేరాల్సిన డీసీఎం అంతలోనే ప్రమాదం..

కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజామొయినోద్దీన్ తన డీసీఎంలో లక్ష్మమ్మ, బాబమ్మ, వెంకటేశ్‌లతో కలిసి కూరగాయాలను తీసుకుని, గురువారం తెల్లవారుజామున మక్తమాదారం నుంచి హైదారబాద్‌లోని కొత్తపేట్ మార్కెట్‌కి బయల్దేరాడు. డీసీఎం కడ్తాల్ శివారులోని ముచ్చర్ల గేట్ వద్దకి రాగానే, కడ్డీల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఖాజామొయినోద్దీన్ అక్కడిక్కడే మృతి చెందగా, డీసీఎంలో ఉన్న ముగ్గురికి గాయలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకి తరలించామని తెలిపారు. మృతుడి సోదరుడు నజీరుద్ధీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలావుండగా ప్రమాద ఘటనలో డీసీఎంలో ఇరుక్కుపోయి మృతి చెందిన ఖాజామొయినోద్దీన్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని డీసీఎం లోపలి నుంచి క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

ఎమ్మెల్సీ పరామర్శ…
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుడి కుటుంబాన్ని గురువారం మధ్యాహ్నం మక్తమాదారం గ్రామంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ. 4,500 ఆర్థిక సాయం ఎమ్మెల్సీ అందజేశారు. రాధాకృష్ణ ట్రస్ట్ తరుపున చైర్మన్ దశరథ్ నాయక్ రూ. 5వేలు, మక్తమాదారం గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబానికి రూ. 7వేలు ఆర్థిక సాయం అందజేశారు. పరామర్శించిన వారిలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్, సర్పంచ్ సులోచన, ఎంపీటీసీ మంజుల, నాయకులు సాయిలు, చంద్రమౌలి, నర్సింహగౌడ్, హన్మానాయక్, డాక్టర్ శ్రీనివాస్, నర్సింహ, బాల్‌రాజ్, చెన్నయ్య, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

