ఆన్లైన్లో అంగన్వాడీ
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సెంటర్లకు ఎంతమంది చిన్నారులు హాజరవుతున్నారు.?
- రిజిస్టర్ వ్యవస్థకు సర్కార్ చెక్
- రంగారెడ్డి జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలు
- గర్భిణులు, బాలింతలు 20,587, చిన్నారులు 1,31,652 మంది
- సేవలన్నీ ఇక నుంచి (ఎన్‌హెచ్‌టీఎస్) యాప్‌లోనే నమోదు
- అంగన్వాడీ టీచర్లకు శిక్షణ
- అంగన్వాడీల్లో పెరుగనున్న పారదర్శకత
షాబాద్, డిసెంబర్ 4 : అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. సెంటర్లకు ఎంతమంది చిన్నారులు హాజరవుతున్నారు.? గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు, సెంటర్‌కు వచ్చే సరుకుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్)పేరుతో ప్రభుత్వం కొత్త యాప్‌ను రూపొందించింది. కేంద్రాల నిర్వహణ వివరాలను గతంలో రిజిస్టర్లో నమోదు చేసేవారు. ఆన్‌లైన్‌తో ఈ వ్యవస్థకు పుల్‌స్టాప్ పడనుంది. ఎప్పటికప్పుడూ వివరాలను మొబైల్లో టీచర్లు నమోదు చేయాలి. సూపర్వైజర్లు, సీడీపీవోలు, డీడబ్ల్యూవోలు పర్యవేక్షణ చేయనున్నారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందుకు సంబంధించి కొత్తగా రూపొందించిన యాప్‌పై గత నెలలో అంగన్వాడీ టీచర్లకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో రిజిస్టర్లలో పొందుపరుస్తున్న వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో నమోదు చేయనున్నారు.
జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలు
జిల్లావ్యాప్తంగా 27 మండలాల్లోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో చేవెళ్ల, ఆమనగల్లు, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్ ప్రాజెక్టుల పరిధిలో 1600 అంగన్వాడీల్లో 220 మినీ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలు 20,587, చిన్నారులు 1,31,652 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం ఏ మేరకు అందుతుంది.? ఎక్కడైనా పంపిణీ చేయకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయా.? అనే అంశాల పరిశీలనను ఇకపై యాప్‌లో నమోదు చేసిన తర్వాతే తెలుసుకునే అవకాశాలున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్‌హెచ్‌టీఎస్) అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు రోజువారీగా పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉండడంతో పారదర్శకత పెరుగనుంది.
యాప్‌పై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ

ప్రభుత్వం నూతనంగా ఎన్‌హెచ్‌టీఎస్(న్యూట్రిషన్ అండ్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం)అనే యాప్‌ను రూపొందించింది. అందులో ఉండే 12 రిజిస్టర్లకు సంబంధించిన వివరాలు, చిన్నారుల ఎత్తు కొలతలు, పౌష్టికాహారం అందజేత వంటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో నిల్వ ఉన్న పౌష్టికాహార సమాచారం వంటి వివరాలపై గత నెలలో రెండు రోజుల పాటు జిల్లా, డివిజన్ స్థాయిలో ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించారు. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారం వల్లే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యం, బరువు ఆధారపడి ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బాలింతలకు పౌష్టికాహారం ఇస్తుండగా ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చిన్నారులకు ఆరేండ్లు వచ్చే వరకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. చిన్నారి ఎత్తు, బరువు, కొలతలను నమోదు చేసి ఆ వివరాల ప్రకారం వయస్సుకు తగ్గిన ఎత్తు, బరువు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా లేదా అనే వివరాలను ఎప్పటికప్పుడూ యాప్‌లో పొందుపర్చాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త యాప్‌తో గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులకు మరింత మెరుగ్గా పౌష్టికాహారం అందనుంది.
వివరాలన్నీ ఆన్లైన్ యాప్‌లో నమోదు
అంగన్వాడీ కేంద్రాల్లో ఇంతకు ముందు టీచర్లు 12 రకాల రిజిస్టర్లలో వివరాలను నమోదు చేసేవారు. ఇకపై రిజిస్టర్లో కాకుండా ప్రత్యేక ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ యాప్ గురించి ఇప్పటికే టీచర్లకు శిక్షణ ఇచ్చాం. యాప్ నుంచి అంగన్వాడీ వ్యవస్థ పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే మరింత పారదర్శకత పెరుగుతుంది. ప్రతిరోజూ గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు అందించిన పౌష్టికాహారం, నిల్వ ఉన్న పౌష్టికాహారం వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన వెంటనే నేరుగా యాప్‌లో కనిపిస్తాయి.
– శోభారాణి, సీడీపీవో, చేవెళ్ల డివిజన్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

