ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లోని కంట్రోల్ రూంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతిలతో కలిసి కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత ఏఆర్వోలు, నోడ ల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
- రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక
షాబాద్, జూన్ 1 : చేవెళ్ల లోక్‌సభ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శనివారం చేవెళ్ల మండలం, గొల్లపల్లి గ్రామంలోని బండా రి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లోని కంట్రోల్ రూంలో రంగారెడ్డి కలెక్టర్ శశాంక, వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతిలతో కలిసి కౌంటింగ్ నిర్వహణపై సంబంధిత ఏఆర్వోలు, నోడ ల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ..
ఈ నెల 4న జరుగనున్న చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎలాంటి వస్తువులు, మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారన్నారు. కౌంటింగ్ కేం ద్రం వద్ద మూడంచెల భద్రత ఉన్నదన్నారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఓ కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రోఅబ్జర్వర్ ఉంటారని, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో జూన్ 4న ఉదయం స్ట్రాంగ్ రూములను ఓపెన్ చేస్తామన్నా రు.
ఓట్ల లెక్కింపు కోసం మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సం బంధించి 28 టేబుళ్లు, మిగతా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలైన చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులకు 14 చొప్పున టేబుళ్లను ఏర్పా టు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని, అబ్జర్వర్ సమక్షంలో ఐదు వీవీ ప్యాట్ల ను ర్యాండమ్‌గా ఎంపిక చేసి స్లిప్పులను లెక్కిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ సిబ్బందిని, ఇతర సిబ్బందిని నియమించామన్నారు. ప్రతి రౌం డ్ పూర్తి కాగానే ఎంకోర్ యాప్‌లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. తెలిపారు. ఈ సమీక్షలో ఏఆర్వోలు, నోడ ల్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారి సైదు లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

