Hyderabad | చిల్ అయిపోదాం.. ఫామ్ హౌస్‌ల వైపు యువత చూపు!
‘అబ్బా.. నెలంతా టెన్షనే.. భరించలేకపోతున్నా..’ ‘అమ్మో వారానికి ఐదురోజులే అన్న మాటే గానీ.. పక్కోనితో నాలుగు ముక్కలు మాట్లాడేందుకూ టైం దొరుకుతలేదు’ ‘పిల్లలు స్కూల్‌కు పోగానే బయలుదేరాలి.. మళ్లీ ఇంటికొచ్చేసరికి పిల్లలు పడుకుంటున్నారు.
- ఉత్సాహం నింపుకొనేందుకు ఒకరోజు
- కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వారాంతాలు, నెలాఖర్లలో ప్రత్యేక ఏర్పాట్లు
- ఒత్తిడిని దూరం చేసుకుంటూ హుషారు
‘అబ్బా.. నెలంతా టెన్షనే.. భరించలేకపోతున్నా..’ ‘అమ్మో వారానికి ఐదురోజులే అన్న మాటే గానీ.. పక్కోనితో నాలుగు ముక్కలు మాట్లాడేందుకూ టైం దొరుకుతలేదు’ ‘పిల్లలు స్కూల్‌కు పోగానే బయలుదేరాలి.. మళ్లీ ఇంటికొచ్చేసరికి పిల్లలు పడుకుంటున్నారు. అంతా రొటీన్’.. ‘కాక.. పని భారం, ఒత్తిడి భరించలేకపోతున్నా..’ ఇవీ ప్రైవేటు ఉద్యోగుల నుంచి వస్తున్న మాటలు.. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్న వారి నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పదాలు.
అందుకే వారే అధికంగా కుదిరితే వారాంతాలు లేదా నెలాఖర్లలో చిల్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకోసం నగర శివారుల్లోని ఫామ్ హౌస్‌ల వైపు చూస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. కుటుంబసభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు మజా చేసేందుకు బయలుదేరుతున్నారు.
Hyderabad | పెద్దఅంబర్‌పేట, మార్చి 9 : సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఐదారు కుటుంబాలతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 15 నుంచి 20 మంది వరకు ఒకేచోట సంతోషంగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేస్తున్న వారు.. ఇతర కుటుంబాలతో కలిసి వెళ్లడం, కలిసి దావత్‌లు చేసుకోవడం చాలా తక్కువయ్యాయి.
పక్కనే ఇల్లు ఉన్నా.. చాలా అరుదుగా కనిపిస్తూ హాయ్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇంట్లోనే ఉంటున్నా.. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుండటంతో పిల్లలతో గడిపేందుకు సైతం సమయం ఉం డటంలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి వేదికలను పిల్లలతో గడిపేందుకు వినియోగిస్తున్నారు. ప్రేమగా వారితో మాట్లాడుతూ.. మంచి చెడులను వివరించేందుకు ఇదే మంచి ప్రదేశం, సమయమని భావిస్తున్నారు. సందడిగా ఆడిపాడుతూ సంతోషాలను పంచుకుంటున్నారు. ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉత్సాహాన్ని నింపుకొంటున్నారు.
నచ్చిన భోజనం..

వారాంతాలు, నెలాఖర్లలో ఫామ్ హౌస్‌లను బుక్ చేసుకుంటున్నవారు భోజన ప్రియులుగా మారుతున్నారు. కొందరు అన్ని వస్తువులు తెచ్చుకుని ఫామ్హౌస్లలోనే వండుకు తింటున్నారు. మరికొందరు ఫామ్‌హౌస్‌లలో అందుబాటులో ఉండే వంట మనుషులతో స్పెషల్‌గా వంటలు వండించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంట్లో వండాల్సిందే.. ఇక్కడా అంతేనా అంటూ గరిటలకు దూరంగా ఉంటున్నారు. వివిధ యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు వేడివేడిగా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా అన్నియాప్ల ద్వారా ఆహార పదార్థాలు వచ్చే వీలున్న ఫామ్ హౌస్‌లనే ఎంచుకుంటున్నారు.
రోజుకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు..
నగర శివారుల్లో ఫామ్ హౌస్‌లకు మంచి గిరాకీ ఉన్నది. ఫామ్ హౌస్‌లో రెండు నుంచి మూడు బెడ్రూంలు, హాల్, కిచెన్, హోం థియేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆవరణలో స్విమ్మింగ్ ఫూల్, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు అందుబాటులో ఉంచుతున్నారు. ఆయా ఫామ్ హౌస్‌లకు 24 గంటలకు తక్కువలో తక్కువ రూ.15 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. కొన్నిచోట్ల మరిన్ని వసతులు సమకూర్చి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు.
వారాంతాల్లోనే ఈ మొత్తాలు వసూలు చేస్తుండగా.. వారం మధ్యలో రూ.10 వేల నుంచి 15 వేలకు దొరకుతున్నాయి. అన్ని వసతులు ఉన్న ఫామ్ హౌస్‌లకు ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ ఉంటున్నది. చాలామంది శుక్రవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌లకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 48 గంటల పాటు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. తిరిగి ఆదివారం సాయంత్రం ఇండ్లకు బయలుదేరుతున్నారు.
ఎండల వేళ చల్లగా..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్న ప్రస్తుత సమయంలో ఈ శివారుల్లోని పచ్చని, చల్లటి వాతావరణం ఉన్న ఫామ్ హౌస్‌లకు మంచి గిరాకీ ఉంటున్నది. స్విమ్మింగ్ ఫూల్, రెయిన్ డ్యాన్స్‌లు సైతం చాలా ఫామ్‌హౌస్‌లలో అందుబాటులో ఉన్నాయి. వేసవి నేపథ్యంలో చల్లటి వాతావరణం ఉండేవాటికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ తరహా వాటికి గిరాకీ పెరిగింది. ఫిబ్రవరి చివర, మార్చి మొదట్లోనే చిన్న పిల్లలకు సీబీఎస్ఈ పరీక్షలు పూర్తవడంతో ఇటు వైపు చూసేవారి సంఖ్య మరింత పెరిగింది.
ఈ నెలాఖరు, వచ్చేనెల మొదటి వారంలో స్టేట్ సిలబస్‌లో చదువుతున్న పిల్లల పరీక్షలు పూర్తయ్యాక.. చిల్ అయ్యేందుకు యువ తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం తెలిసినవారి కొందరు సంప్రదిస్తుండగా.. ఆన్లైన్లోని పలు సైట్లను మరికొందరు ఆశ్రయిస్తున్నారు. ఏదైతేనేం అనుకున్న సమయానికి మంచి ఫామ్‌హౌస్ దొరికితే అదే పదివేలు అనుకుంటున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

