ఔటర్‌పై అందాలు
ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్‌జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- పచ్చని పందిళ్ల నడుమ ఔటర్ ప్రయాణం
- ప్రయాణికులను ఆకట్టుకునేలా ఇంటర్‌ఛేంజ్‌లు, ఓవర్ పాస్‌ల బ్యూటిఫికేషన్
సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ): ఔటర్ ప్రయాణం కనువిందు చేస్తున్నది.. వివిధ జిల్లాల నుంచి ఔటర్ మీదుగా భాగ్యనగరంలోకి వచ్చే ప్రయాణికులు, సందర్శకులకు వినూత్న రీతిలో స్వాగతం పలికేలా హెచ్ఎండీఏ హెచ్‌జీసీఎల్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి వద్ద చెయ్యి ఆకారంతో ఏర్పాటు చేసిన ఆకృతి విశేషంగా ఆకట్టుకుంటున్నది. నార్సింగి పాయింట్(ఓవర్ పాస్) వద్ద కాకతీయ కళాతోరణం ఏర్పాటు చేశారు.

ఫైబర్‌గ్లాస్ మెటీరియల్‌తో దాదాపు రూ.3లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కళాతోరణం ఔటర్‌కు మరింత వన్నెను తీసుకువచ్చింది. శామీర్‌పేట, పటాన్చెరు వద్ద ఈ తరహా అందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుప్పాలగూడ-నార్సింగి రోడ్లో మీడియన్‌లో ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతులు ప్రయాణికులు, స్థానికులను ఆకట్టుకుంటున్నాయి.

ఆయా స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని ఏర్పాటు చేయగా.. అటు వెళ్లే చాలా మంది వీటి వద్ద నిల్చుని సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. కాగా, రాజధాని మణిహారమైన ఔటర్ కేంద్రంగా నాగ్‌పూర్(ఎన్‌హెచ్ 44), బెంగళూరు(ఎన్‌హెచ్ 44), ముంబై(ఎన్‌హెచ్ 65), విజయవాడ(ఎన్‌హెచ్ 65) రహదారుల నుంచి నగరంలోకి చేరుకునే ప్రయాణికులకు అపూర్వ స్వాగతం పలికేలా ఔటర్లో బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. ఎక్కడ ఖాళీ ప్రాంతం కన్పించకుండా ల్యాండ్‌స్కేపింగ్ పనులు, ప్రత్యేక ఆకర్షణతో ఏర్పాటు చేస్తున్న శిల్పాలు, ఆకృతులు కనువిందు చేస్తున్నాయి.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

