పదేండ్లలో లేని కరువు.. వంద రోజుల్లోనే ఎందుకొచ్చింది ?
చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
- కేసీఆర్‌ను నిషాన లేకుండా చేస్తావా..?.. రేవంత్ ఎందుకింత ఆహంకారం ?
- విమర్శలు మానుకొని.. ప్రజా సేవ చెయ్యి
- నువ్వు రాకపోకలు సాగించే ఫ్లైఓవర్లు.. కేసీఆర్ వేసినవే.. కనిపిస్తలేవా.?
- కేసీఆర్ పెట్టిన భిక్షతోనే రంజిత్ రెడ్డి ఎంపీ అయ్యాడు
- మోసకారి రంజిత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి
- కాంగ్రెస్, బీజేపీ అబద్దపు వాగ్దానాలను నమ్మి మరోమారు మోసపోవద్దు
- బీఆర్ఎస్ అభ్యర్థి కాసానిని గెలిపించుకుందాం.. ఐదేండ్లు సేవ చేయించుకుందాం
- సన్నాహక సమావేశంలో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- సేవ చేసేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి..
- చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
బడంగ్‌పేట, మార్చి 24 : చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిపిస్తే సబండ వర్గాలకు సేవ చేస్తానని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జిల్లెలగూడలోని సామ యాదిరెడ్డి గార్డెన్లో ఆదివారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, డీసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గే మల్లేశం, బుగ్గారపు దయానంద్ గుప్త, తదితరులు హాజరయ్యారు.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని శపథం చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు పి.సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య సంపూర్ణంగా మద్దతు ప్రకటించడంతో వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలు శ్రమించకుండా ఏ లీడర్ గెలువలేడన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పనిచేసి ఎంతో మార్పు తీసుకొచ్చానని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మీర్‌పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మీర్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, బడంగ్‌పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, ఆర్కేపురం అధ్యక్షుడు నాగేశ్, మహేశ్వరం అధ్యక్షుడు రాజు నాయక్, కందుకూరు అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, తుక్కుగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మాజీ ఎంపీపీ సిద్దాల లావణ్య బీరప్ప, జిల్లెల కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు , బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వంద రోజుల్లో కాంగ్రెస్ తెచ్చిన మార్పు..
పంటలు ఎండబెట్టడమే..
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను నిషాన లేకుండా చేస్తావా.?ఎందుకు ఇంత ఆహంకారమని రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే కరెంటు కోతలు, రైతుల పంటలు ఎండబెట్టడం, రైతుబంధు నిలిపివేత ఇలా అనేక మార్పులు తీసుకువచ్చిదని తెలిపారు.
కేసీఆర్ ఏం చేశాడో రేవంత్ రెడ్డికి కనిపిస్తలేదా..? రేవంత్ రాకపోకలు సాగిస్తున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, విశాలంగా మారిన రోడ్లు కేసీఆర్ వేసినవేనని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లలో కేసీఆర్ కన్పిస్తున్నడు, రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, ఇలా అనేక సంక్షేమ పథకాల రూపంలో కేసీఆర్ కన్పిస్తున్నాడన్నారు.

కేసీఆర్ పెట్టిన భిక్షతో రంజిత్ రెడ్డి చేవెళ్లకు ఎంపీగా గెలిచారని, అంతకు ముందు ఎవరికీ తెలియదన్నారు. భిక్ష పెట్టిన కేసీఆర్‌నే స్వార్థంకోసం మోసంచేసి కాంగ్రెస్‌లో చేరారని.. ఇలాంటి మోసకారి రంజిత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌కు కాసాని జ్ఞానేశ్వర్ సుపరిచితుడని తెలిపారు. గతంలో జెడ్పీ చైర్‌పర్మన్‌గా, ఎమ్మెల్సీగా 96కులాల గొంతుకగా పనిచేసిన నిబద్దత గల నాయకుడికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి 60వేల మెజార్టీ ఇద్దామని, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ అబద్దపు వాగ్దానాలను నమ్మి మరోమారు మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
రెండు నెలలు కష్ట పడుదాం
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారు. ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఎంపీ రంజిత్ రెడ్డి ఐదేండ్ల కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించుకొని పార్టీ మారారు. కేసీఆర్ పాలనలో చెరువులు ఎప్పుడూ నిండు కుండలా ఉండేవి. కాంగ్రెస్ పాలన వచ్చిన వంద రోజుల్లోనే చెరువులు ఎండి పోతున్నాయి. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనివిప్పు కలుగడంలేదు. పదేండ్లలో లేని కరువు.. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే కరువు ఎందుకొచ్చింది. రెండు నెలలు కష్ట పడుదాం.. కాసానిని ఎంపీగా గెలిపించుకుందాం. ఐదు సంవత్సరాలు పని చేయించుకుందాం.
– ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య
కాంగ్రెస్ వచ్చింది.. జనరేటర్లు తెచ్చింది
కాంగ్రెస్ పాలన వందరోజులు కాక ముందే జనరేటర్లు తీసుకువచ్చింది. ప్రజలందరినీ అంతర్మథనంలో పడేసింది. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలివేస్తున్నది. కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ చేస్తున్న ఆరాచకాలను, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలి.
– ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, వాణీదేవి, దయానంద్ గుప్త
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

