Chevella : తెలంగాణ రాష్ర్టం పచ్చబడటం బీజేపీకి ఇష్టం లేదు.. మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు ఇవ్వటంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి వలన జిల్లాలోని ఇబ్రహీంపట్నం ప్రాంతానికి సాగునీరు అందించటంలో జాప్యం జరుగుతుందని, ఈ ప్రాంతం పచ్చబడటం బీజేపీకి ఇష్టం లేదని రాష్ట్ర టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీల్లో ఆయన మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి రూ. 121కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా లాంటి వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ పథకానికి జాతీయహోదా ఇవ్వాలని అనేకమార్లు కేంద్రాన్ని కోరినప్పటికీ జాతీయహోదా ఇవ్వకపోగా అరపైసా నిధులు కూడా ఇవ్వలేదన్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయటానికి సాగునీరు అందించే కార్యక్రమానికి జాప్యం జరుగుతుందని మంత్రి అన్నారు. అలాగే ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ముచ్చర్ల సమీపంలో ఫార్మాసిటిని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని, దీనికి కూడా కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. కేంద్రం పైసా ఇవ్వకుండా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగంలో ఎంతో ముందుకెలుతున్నామన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి శాశ్వతంగా సాగునీరు అందించాలని స్థానిక శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనేకసార్లు తన దృష్టికి తీసుకువచ్చారని ఆయన కళలను నిజం చేయటం కోసం ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల్లో మిషన్‌భగీరథ పైపులైన్ కోసం రోడ్లు పూర్తిగా తవ్వటం వలన అద్వానంగా మారాయని వాటిని మరమ్మతు చేయటానికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి కోరారు. వెంటనే స్పందించిన మంత్రి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికీ రూ. 15కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే, మిగిలిన మున్సిపాలిటీలకు కూడా అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనుల కోసం అవసరమైన నిధులను కూడా ప్రభుత్వం అందజేస్తుందన్నారు. నగరానికి అతి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నం పెద్దచెరువును కూడా తుర్కయాంజల్ మాసాబ్చెరువు తరహాలోనూ అభివృద్ధి చేయాలని ఇందుకోసం అవసరమైన నిధులను అందజేస్తామన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

