గెలుపే లక్ష్యంగా..
అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.
- జిల్లా పరిధిలోని అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్
- దూకుడు పెంచిన అభ్యర్థులు.. సందడిగా సన్నాహక సమావేశాలు
- కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ
రంగారెడ్డి, మార్చి 25(నమస్తే తెలంగాణ): అన్ని పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఐదు పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు అనుబంధం ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు దూకుడును పెంచాయి.
పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఇప్పటికే మొదలవ్వగా.. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యేలా కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి, బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం స్వల్పంగానే తేడా ఉండడం.. కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం బీఆర్ఎస్కు అనుకూలిస్తాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
రంగంలోకి బలమైన అభ్యర్థులు..
బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మకంగా ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. చేవెళ్ల స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నాగర్‌కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి లక్ష్మారెడ్డిలను అభ్యర్థులుగా ప్రకటించారు. గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. వ్యూహాత్మకంగా చేవెళ్ల, భువనగిరి స్థానాలకు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలకుగాను 5 స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ సత్తా చాటింది.
అదే ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికల్లోనూ మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుచుకునేలా గులాబీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ప్రస్తుత ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం.. అన్ని వర్గాల సంక్షేమాన్ని సైతం విస్మరించడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.
సమావేశాలతో క్యాడర్‌ను సన్నద్ధం చేస్తూ..
పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుల నేతృత్వంలో ఒక విడుత అన్ని నియోజకవర్గాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆయా సమావేశాల్లో చేసిన దిశానిర్దేశం మేరకు జిల్లాకు చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పక్కా ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో సమావేశాలను నిర్వహిస్తున్నారు.
చేవెళ్ల పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్టీ క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే మహేశ్వరం, పరిగి నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 26న తాండూరులో, 27న రాజేంద్రనగర్‌లో, 30న శేరిలింగంపల్లిలో, ఏప్రిల్ 1న చేవెళ్లలో, 3న వికారాబాద్‌లో సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత మరోసారి సమావేశాలు నిర్వహించేలా వ్యూహ రచన చేస్తున్నారు. అభ్యర్థులు సైతం ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలను కలిసి గెలుపునకు కృషి చేయాలని కోరుతున్నారు. కేసీఆర్‌తో భారీ బహిరంగ సభల నిర్వహణకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తుండడంతోపాటు రోడ్ షోలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

