అధికారుల వైఖరిపై బీఆర్ఎస్ ఆగ్రహం
వికారాబాద్ మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకుల కోసం పనిచేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నాయకులు పేర్కొన్నారు.
- స్పీకర్ పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీలను తొలగించకుండా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ జన్మదిన ఫ్లెక్సీలు తీసేయడంపై మండిపాటు
- మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా
వికారాబాద్, జూన్ 30 : వికారాబాద్ మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకుల కోసం పనిచేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా.. బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తీసే స్తున్నారని మంగళవారం మున్సిపల్ అధికారులతో వారు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వికారాబాద్ పట్టణంలో స్పీకర్ పుట్టిన రోజు వేడుకలు ఉన్నప్పుడు ఫ్లెక్సీలను తొలగించకుండా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ జన్మదిన ఫ్లెక్సీలను తీసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టినరోజు ఫ్లెక్సీలను ముట్టకుం డా కేటీఆర్‌కు సంబంధించినవి ఎందుకు తొలగించారని.. మున్సిపల్ అధికారులకు బీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. వికారాబాద్ పట్టణంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని హితవు పలికారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడం సరికాద ని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్, కౌన్సిలర్ అశోక్, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, అశోక్, గయాజ్, రాజు, రాంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నవీన్, అనంత్‌రెడ్డి, కమాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

