ఈ నెల 22 నుంచి పుస్తకాల పండుగ
పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్ధమవుతున్నది.
- జనవరి 1 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్.. 300 స్టాళ్ల ఏర్పాటు.. సాహిత్య ప్రియులకు పుస్తక సంబురం
పుస్తకం హస్త భూషణం అంటారు. ప్రపంచ స్థితిని, గతిని మార్చింది అక్షరమే. అన్యాయాలు, అణిచివేతలు, దోపిడీ పీడనలు, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేది పుస్తకమే. మనలోని కారుచీకట్లను తొలిగించి జ్ఞాన వెలుతురును ప్రసరింపజేసేందుకు త్వరలోనే నగర లోగిళ్లలో సందడి చేయనున్నది. ఆత్మీయంగా పలకరించి హస్తభూషణంగా మారనున్నది. సాహితీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుస్తకాల పండుగ రానే వచ్చింది. దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హైదరాబాద్ బుక్ఫెయిర్ డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు మరోసారి మన ముందుకొచ్చి అలరించనున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): పుస్తకం మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. నూతన విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు పుస్తకమే పునాది. హక్కుల కోసం ఉద్యమించేలా పురిగొల్పేది పుస్తకమే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు అంతా సిద్ధమవుతున్నది. పుస్తకాల జాతర సమీపిస్తున్నది. వచ్చే వారమే తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తక ప్రదర్శన కొలువుదీరనుంది. ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం నెలకొననుంది. ఈసారి బుక్ ఎగ్జిబిషన్లో మొత్తం 300 స్టాళ్లు ఉండనున్నాయి. 10లక్షల పుస్తకాలు.. ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. ఈ సాహిత్య వేడుకను హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతియేటా డిసెంబర్లో నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బుక్ ఫెయిర్ సొసైటీకి ప్రోత్సాహాన్ని అందజేస్తున్నది.
భారతీయ భాషల సాహిత్య వేదిక హైదరాబాద్..
దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా పేరుగాంచిన హెచ్బీఎఫ్.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూతో పాటు ఇతర భారతీయ భాషల సాహిత్యం లభిస్తుంది. దీంతో పాటుగా బాల సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం, పురాణ సాహిత్యం, నవలలు, కథలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కథల పుస్తకాలు పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం, విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ వివిధ పబ్లికేషన్స్ వారి మెటీరియల్స్ కూడా ఈ పుస్తక ప్రదర్శనలో లభించనున్నాయి.
గ్రామీణ గ్రంథాలయాల కోసం పుస్తక వితరణ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ గ్రంథాలయాల కోసం హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలను వితరణ చేయడం ప్రత్యేకత. ప్రతియేటా బుక్స్ డొనేషన్ చేసిన వారి నుంచి సేకరించిన పుస్తకాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, విఠలాచార్య లాంటి ప్రముఖుల గ్రామాల్లో గ్రంథాలయాలకు అందజేసినట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ వెల్లడించారు. బుక్ ఎగ్జిబిషన్ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8.30వరకు కొనసాగనుంది. శని, ఆదివారంతోపాటు ఇతర సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచే ప్రారంభమై రాత్రి 9గంటల వరకు కొనసాగనుందని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

